న్యూఢిల్లీ, మే 26: వీసా స్కామ్‌కు సంబంధించి కాంగ్రెస్ ఎంపీ కార్తీ చిదంబరాన్ని సీబీఐ గురువారం తొమ్మిది గంటల పాటు ప్రశ్నించింది. యూకే నుంచి భారత్‌కు చేరిన 16 గంటల్లోగా సీబీఐ విచారణకు హాజరుకావాలంటూ ప్రత్యేక కోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు.. కార్తీ గురువారం ఉదయం 8 గంటలకు ఇక్కడి సీబీఐ ఆఫీసుకు చేరుకొన్నారు.
విచారణకు ముందు మీడియాతో మాట్లాడిన ఆయన.. తనపై పెట్టిన కేసు బోగస్ అని, డబ్బులు తీసుకొని చైనీయులకు తాను వీసాలను ఇచ్చానన్న ఆరోపణలు అవాస్తవమన్నారు.