తిరువనంతపురం: లైంగిక వేధింపుల కేసులో కేరళ సీఎం ఓమన్ చాండీపై సీబీఐ క్లీన్ చిట్ ఇచ్చింది. చీఫ్ జుడిషియల్ మెజిస్ట్రేట్ కోర్టుకు ఆ నివేదికను సమర్పించారు. సోలార్ స్కామ్‌లో ప్రధాన నిందితురాలిగా ఉన్న ఓ మహిళ .. మాజీ సీఎంపై ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. మంగళవారం రోజున సీబీఐ రిపోర్ట్‌ను అందజేసింది. మాజీ సీఎం చాండీతో పాటు మాజీ కేంద్ర మంత్రి కేసీ వేణుగోపాల్, ఇతర నేతలపై ఆ మహిళ లైంగిక వేధింపుల ఆరోపణలు చేసింది. 2012లో ఆ మహిళను వేధించినట్లు రిపోర్ట్ నమోదు అయ్యింది. అయితే సీపీఎం నేతృత్వంలోని కేరళ ప్రభుత్వం.. 2021లో ఆ ఘటనపై సీబీఐ విచారణకు ఆదేశించింది. సీఎం అధికార నివాసానికి ఆ మహిళ వెళ్లినట్లు ఎక్కడా ఆధారాలు లేవని సీబీఐ తన రిపోర్ట్‌లో తెలిపింది.