న్యూఢిల్లీ: ‘ఉద్యోగం కోసం భూమి’ కుంభకోణం కేసులో సీబీఐ తుది చార్జిషీటును ప్రత్యేక కోర్టులో శుక్రవారం దాఖలు చేసింది. ఈ కేసులో మాజీ రైల్వే మంత్రి, బీహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్, ఆయన కుటుంబ సభ్యులు నిందితులు. లాలూ, ఆయన కుటుంబ సభ్యులు రైల్వే అధికారులతో కుమ్మక్కై, ఉద్యోగార్థుల నుంచి భూమిని కారుచౌకగా తీసుకుని, అందుకు బదులుగా రైల్వే ఉద్యోగాలను ఇప్పించినట్లు సీబీఐ ఆరోపించింది. ఈ చార్జిషీటును జూలై 6న ప్రత్యేక న్యాయస్థానం పరిశీలిస్తుంది.