కోల్‌కతా: ఆర్జీ కర్ కాలేజ్ అండ్ హాస్పిటల్ మాజీ ప్రిన్సిపాల్ డాక్టర్ సందీప్ ఘోష్ ఒకే మాట మీద ఉన్నారు. 18 రోజుల్లో మొదట కోల్‌కతా పోలీసులు, ఆ తర్వాత సీబీఐ అధికారులు ప్రశ్నించినా; రెండుసార్లు పాలిగ్రాఫ్ టెస్ట్‌లు చేసినా ఆయన ఒకే విషయాన్ని చెప్తున్నారు.
పీజీటీ డాక్టర్ మరణించినట్లు తనకు ఆగస్టు 9న ఉదయం సుమారు 10.20 గంటల ప్రాంతంలో తెలిసిందని చెప్పారు. మరోవైపు ఈ కేసులోదర్యాప్తు అధికారులు ఘోష్‌కు తెలిసిన వ్యక్తులు కొందరు ఘటన జరిగిన రోజు దవా ఖానలో ఎందుకున్నారు? వీరికి ఎవరు సమాచారం ఇచ్చా రు? డాక్టర్ ఆత్మహత్య చేసుకున్నట్లు ఆమె తల్లిదండ్రులకు ఫోన్ చేయాలని కాలర్‌కు ఎవరు చెప్పారు? హాస్పిటల్‌కు పోలీసులు వెళ్లినపుడు ఘోష్ అక్క డ ఎందుకు లేరు? అనే అంశాలను సీబీఐ అధికారులు పరిశీలిస్తున్నారు. ఘోష్ కాల్ రికార్డులను పరిశీలిస్తున్నారు.