(స్పెషల్ టాస్క్ బ్యూరో)హైదరాబాద్, మార్చి 23 (నమస్తే తెలంగాణ): మొన్న బీఆర్ఎస్, నిన్న ఆప్, ఇ ప్పుడు టీఎంసీ.. ఎన్నికల వేళ విపక్షాల ను లక్ష్యంగా చేసుకుని కేంద్రంలోని బీజే పీ చెలరేగి పోతున్నది. బీజేపీ సర్కారు వై ఫల్యాలను, కార్పొరేట్లకు దోచిపెడుతున్న విధానాలను పార్లమెంట్లో ఎప్పటికప్పు డు ఎండగట్టిన తృణమూల్ కాంగ్రెస్ను బీజేపీ టార్గెట్ చేసింది. ఆ పార్టీ నేత, మా జీ ఎంపీ మహువా మొయిత్రా ఇంటిపై సీబీఐ దాడులు నిర్వహించింది. పార్లమెంట్లో ప్రశ్నలు అడిగేందుకు డబ్బు లు తీసుకున్నారన్న ఆరోపణల కేసులో శనివారం పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలోని మహువా నివాసంతో పా టు ఇతర నగరాల్లో ఆమెకు చెందిన కా ర్యాలయాల్లో అధికారులు ముమ్మర తనిఖీలు చేశారు. మహువాపై దర్యాప్తు చేప ట్టి ఆరు నెలల్లోగా నివేదిక ఇవ్వాలని సీబీఐని లోక్పాల్ ఆదేశించిన నేపథ్యంలో గురువారం ఎఫ్ఐఆర్ నమోదు చేసిన సీబీఐ తాజాగా మహువా ఇంట్లో సోదాలు నిర్వహించింది. మరోవైపు, ఇదే వ్యవహారానికి సంబంధించి విదేశీ మారక ద్రవ్య నిర్వహణ చట్టం (ఫెమా) నిబంధనల ఉ ల్లంఘన కేసులో ఈడీ ఆమెకు ఇటీవలే సమన్లు జారీ చేసింది.
ఇవి ప్రతీకార రాజకీయాలే
కేంద్రంలోని బీజేపీ తమపై ప్రతీకార రా జకీయాలకు పాల్పడుతున్నదని బెంగాల్లోని అధికార టీఎంసీ మండిపడింది. దేశంలో నెలకొన్న పలు సమస్యల నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికే కేంద్రం ఈ దాడులు జరుపుతున్నదని, రాజకీయ ప్ర తీ కారానికి సీబీఐ దాడులే ప్రత్యక్ష నిదర్శనమని ఆ పార్టీ నేత శంతన్ సేన్ ఆరోపించారు. ఎన్నికల సమయంలో ప్రతిపక్షాలను దెబ్బతీయడమే బీజేపీ లక్ష్యంగా కనిపిస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు.