Cauvery Water Dispute | మళ్లీ వేడెక్కిన ‘కావేరీ’ వివాదం.. రేపు అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసిన సీఎం
Cauvery Water Dispute | తమిళనాడు-కర్ణాటక రాష్ట్రాల మధ్య వివాదం మరోసారి ముదురుతున్నది. కావేరీ జలాల వివాదం మళ్లీ తెరపైకి వచ్చింది. ఈ విషయంలో కర్ణాటక అవలంభిస్తున్న వైఖరిపై తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ విమర్శించారు.
Cauvery Water Dispute | తమిళనాడు-కర్ణాటక రాష్ట్రాల మధ్య వివాదం మరోసారి ముదురుతున్నది. కావేరీ జలాల వివాదం మళ్లీ తెరపైకి వచ్చింది. ఈ విషయంలో కర్ణాటక అవలంభిస్తున్న వైఖరిపై తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ విమర్శించారు. అంతరాష్ట్ర నదీజలాల వివాదంపై సంబంధించి ఈ నెల 16న అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ నెల 15 నాటికి కర్ణాటకలోని నాలుగు ప్రధాన డ్యామ్‌లలో నీటి నిల్వ 75.586 టీఎంసీలు ఉండగా.. తమిళనాడు మెట్టూరు రిజర్వాయర్‌లో నీటిమట్టం 13.808 టీఎంసీలు మాత్రమే ఉందని తెలిపారు. వాతావరణ శాఖ అంచనాల ప్రకారం.. ఈ సారి తగిన వర్షాలు కురిసే అవకాశం ఉందని.. కావేరి జలాల నియంత్రణ కమిటీ సూచనల మేరకు కర్ణాటక నీటి విడుదలకు నిరాకరించడం తమిళనాడు రైతులకు ద్రోహం చేడమేనన్నారు.
దీన్ని తమిళనాడు ఎప్పటికీ సహించదని స్టాలిన్ స్పష్టం చేశారు. తమిళనాడుకు కావేరి నది నుంచి ప్రతిరోజూ ఎనిమిది వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆదివారం కర్ణాటక సీఎం సిద్ధరామయ్య తెలిపారు. ఈ నెలాఖరు వరకు తమిళనాడుకు ప్రతిరోజూ నీటిని విడుదల చేయాలని కావేరీ వాటర్ రెగ్యులేషన్ కమిటీ కర్ణాటక ప్రభుత్వాన్ని ఆదేశించిన విషయం తెలిసిందే. తమిళనాడు రాష్ట్ర అసెంబ్లీలోని అన్ని పార్టీల శాసనసభా పక్ష నేతలతో సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు సీఎం స్టాలిన్ పేర్కొన్నారు. భేటీలో వివాదంపై అనుసరించాల్సిన అంశాలపై చర్చించనున్నారు. సమావేశం 16న ఉదయం 11 గంటలకు సచివాలయంలో జరుగన్నది. తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల మధ్య జదీ జలాల వివాదం 140 ఏళ్లకుపైగా కొనసాగుతున్నది. కర్ణాటక నదిపై ఆనకట్ట నిర్మించాలని నిర్ణయించగా.. దాన్ని తమిళనాడు వ్యతిరేకించింది.
ఈ వివాదం చాలా సంవత్సరాలు కొనసాగగా.. బ్రిటీష్ ప్రభుత్వం జోక్యం చేసుకొని రెండు రాష్ట్రాల మధ్య ఒప్పందం కుదుర్చింది. ఈ ఒప్పందం ప్రకారం.. 556 వేల మిలియన్ క్యూబిక్ అడుగుల నీటిని తమిళనాడుకు, 177 వేల మిలియన్ క్యూబిక్ అడుగుల నీరు కర్ణాటకకు మళ్లించాలని నిర్ణయించారు. కావేరి నది కర్ణాటకలోని కొడగు జిల్లాలో పుట్టి తమిళనాడు గుండా ప్రవహించి బంగాళాఖాతంలో కలుస్తుంది. నదిలో కొంత భాగం కేరళ, పుదుచ్చేరిలో సైతం ఉన్నది. 1972లో ఓ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ 1976లో నదీ జలాలకు సంబంధించి నాలుగు రాష్ట్రాల మధ్య ఒప్పందం చేసుకున్నప్పటికీ నదీ జలాల విషయంలో ఇంకా వివాదం కొనసాగుతూ వస్తున్నది. బ్రిటీష్ కాలంలో జరిగిన ఒప్పందాన్ని కర్ణాటక పరిగణలోకి తీసుకునేందుకు ఆసక్తి చూపడం లేదు. తమిళనాడు మాత్రం ఆ ఒప్పందమే సరైందని భావిస్తున్నది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bhatti Vikramarka | డిప్యూటీ సీఎం ఇలాకాలో కాంగ్రెస్‌కు షాక్.. సర్పంచ్ ఫాతిమాభి రాజీనామా!
Kachavaram | డిప్యూటీ సీఎం ఇలాకాలో కాంగ్రెస్‌కు షాక్.. అభివృద్ధిపై అసంతృప్తితో సర్పంచ్ రాజీనామా..!
కొలనూరులో వీధి కుక్కల స్వైరవిహారం.. దూడ మృతి
Newzealand Cricket | టీమిండియాతో వన్డే సిరీస్.. న్యూజిలాండ్ విధ్వంసక ఓపెనర్లకు పిలుపు..!
Telangana | తెలంగాణలో కొత్త జిల్లాలకు పదేళ్లు.. వికేంద్రీకరణ ప్రయాణంపై తొలి సీఎస్ రాజీవ్‌శర్మ కీలక విశ్లేషణ
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

