పాట్నా: బీహార్ ప్రభుత్వం చేపట్టిన కుల గణన సర్వే(Caste Survey)ను ఆ రాష్ట్ర హైకోర్టు నిలిపివేసింది. ప్రజల ఆర్ధిక, కుల హోదాకు సంబంధించిన డేటాను సేకరించేందుకు నితీశ్ కుమార్ సర్కార్ సర్వే చేపట్టింది. ఇంటింటి సర్వేను రాష్ట్రంలోని అన్ని ప్రతిపక్ష పార్టీలు స్వాగతించాయని ఇవాళ ఉదయం సీఎం నితీశ్ తెలిపారు. నిజాకిని కుల గణన కేంద్ర ప్రభుత్వం చేపట్టాల్సిన ప్రక్రియ, కానీ బీహార్లో రాష్ట్ర సర్కారు ఆ ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. సర్వేను వ్యతిరేకిస్తున్న వారిపై ఆయన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అవసరమైన వారికి సేవలు అందించడంలో సర్వే ఉపయోగపడుతుందని సీఎం నితీశ్ తెలిపారు. తొలి రౌండ్ సర్వే జనవరి 7వ తేదీ నుంచి 21వ తేదీ వరకు నిర్వహించారు. ఇక రెండవ సర్వే ఏప్రిల్ 15 నుంచి మే 15వ తేదీ వరకు నిర్వహించాల్సి ఉంది.
#WATCH | Bihar Deputy CM Tejashwi Yadav speaks after Patna HC puts a stay on Caste-based census, says, "Caste-based census is for welfare of the people, we want to eradicate poverty, backwardness. One thing is clear, it is bound to happen" pic.twitter.com/GZG7V5m7de
— ANI (@ANI) May 4, 2023