బెంగళూరు: అవినీతి అధికారుల దాడుల్లో క్యాష్ పైప్‌లైన్ బయటపడింది. నోట్ల కట్టలతో నిండిన పైప్ లైన్ విషయం తెలిసిన అధికారులు ప్లంబర్ సాయంతో అందులో దాచిన డబ్బును వెలికితీశారు. కర్ణాటకలో ఈ ఘటన జరిగింది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులకు సంబంధించి 15 మంది అధికారులకు చెందిన నివాసాలపై కర్ణాటక అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) బుధవారం రైడ్లు జరిపింది. 60 చోట్ల సోదాలు నిర్వహించింది. ఇందులో భాగంగా కల్బుర్గి జిల్లాలోని పీడబ్ల్యూడీ జాయింట్ ఇంజనీర్ శాంతగౌడ్ బిరాదార్ ఇంటిపై అధికారులు దాడులు చేశారు.
ఈ సందర్భంగా కేవలం డబ్బులు దాచేందుకు ఒక పైప్ లైన్‌ను ఏర్పాటు చేసినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. ప్లంబర్‌ను రప్పించి గోడకు ఏర్పాటు చేసిన పైపు లైన్‌ను తొలగించి అందులో దాచిన నోట్ల కట్టలను బయటకు తీయించారు. తనిఖీల సందర్భంగా శాంతగౌడ్ బిరాదార్ ఇంటి నుంచి రూ.25 లక్షల నగదు, భారీగా బంగారాన్ని ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
#WATCH Karnataka ACB recovers approximately Rs 13 lakhs during a raid at the residence of a PWD junior engineer in Kalaburagi
— ANI (@ANI) November 24, 2021
(Video source unverified) pic.twitter.com/wlYZNG6rRO