డెహ్రాడూన్: దేవుళ్లపై అనుచిత వ్యాఖ్యలు చేసి సమాజంలో వివాదాలు సృష్టించడం ఈ మధ్య కొందరు సెలెబ్రిటీలకు అలవాటుగా మారింది. తాజాగా స్టాండప్ కమెడియన్ (Stand-up comedian) యశ్ రథి (Yash Rathi) కూడా అదే బాటలో నడిచాడు. శ్రీరాముడిపై (Lord Ram) అనుచిత వ్యాఖ్యలు చేసి రామభక్తులకు ఆగ్రహం తెప్పించాడు.
ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రాడూన్‌లో మార్చి 8న జరిగిన ఓ కార్యక్రమంలో కమెడియన్ యశ్ రథి ప్రదర్శన ఇస్తూ.. శ్రీరాముడి గురించి అనుచిత వ్యాఖ్యలు చేశాడు. దాంతో ఉత్తరాఖండ్ హిందూత్వ ఆర్గనైజేషన్ అధ్యక్షుడు ఈ ఘటనపై పోలీసులకు కంప్లెయింట్ ఇచ్చాడు. అంతేగాక ఉత్తరాఖండ్‌లోని పలు హిందూ సంఘాలకు చెందిన సభ్యులు కూడా ఆందోళన చేస్తున్నారు.