లక్నో: బీఎస్పీ చీఫ్ మాయావతి మేనల్లుడు ఆకాశ్ ఆనంద్పై ఉత్తరప్రదేశ్లో కేసు నమోదైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఆకాశ్ సీతాపూర్లో ఆదివారం జరిగిన లోక్సభ ఎన్నికల ప్రచార సభలో మాట్లాడుతూ, ‘ఇది (యూపీ ప్రభుత్వం) ద్రోహుల ప్రభుత్వం. యువతను ఆకలితో అలమటించేలా చేస్తున్న, వృద్ధులను బానిసలుగా మార్చుతున్న ఉగ్రవాద ప్రభుత్వం. ఇలాంటి ప్రభుత్వాన్ని అఫ్గానిస్థాన్లో తాలిబన్లు నడుపుతున్నారు’ అని అన్నారు. ఆకాశ్తోపాటు బీఎస్పీ అభ్యర్థి మహేంద్ర యాదవ్ తదితరులపై కేసు నమోదైంది.