Sanjay Gaikwad | మహారాష్ట్రలో శివసేన షిండే వర్గం ఎమ్మెల్యే (Shinde Sena MLA) సంజయ్ గైక్వాడ్ (Sanjay Gaikwad)పై కేసు నమోదైంది. ఓ హోటల్ కార్మికుడిపై దాడి కేసులో (assaulting canteen staff) ముంబై పోలీసులు ఈ మేరకు చర్యలు తీసుకున్నారు.
ముంబై చర్చిగేట్లోని ఎమ్మెల్యేల క్యాంటీన్లో తనకు వడ్డించిన ఆహారం రుచిగా లేదని, కుళ్లిపోయిందని ఆరోపిస్తూ క్యాంటిన్ కార్మికుడు, మేనేజర్, ఇతర సిబ్బందిపై పిడిగుద్దులు కురిపించారు. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి ఇటీవలే సోషల్ మీడియాలో వైరల్ కాగా.. ఎమ్మెల్యే తీరుపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమైంది. మహారాష్ట్ర అసెంబ్లీ, విధాన సభలో ఈ అంశాన్ని ప్రతిపక్షాలు, శివసేన (ఉద్ధవ్) వర్గం లేవనెత్తాయి.
ఇక ఈ ఘటనపై సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ మాట్లాడుతూ.. ఈ విషయంపై విచారణ జరిపి పోలీసులు తగిన చర్యలు తీసుకుంటారని చెప్పారు. ఈ నేపథ్యంలోనే ఘటన జరిగిన రెండు రోజుల తర్వాత ఎమ్మెల్యేపై పోలీసులు చర్యలు చేపట్టారు. కాగా, ఎమ్మెల్యే సంజయ్ గైక్వాడ్ వివాదాల్లో చిక్కుకుకోవటం కొత్తేమీ కాదు. గతేడాది సెప్టెంబర్‌లో కాంగ్రెస్ అధినేత రాహుల్‌గాంధీ నాలుకను కోసిన వారికి రూ.11 లక్షల బహుమతి ఇస్తానని సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో ఓ పోలీసు అధికారి గైక్వాడ్ కారును కడగడం కనిపించింది.
Also Read..
Ajit Doval | భారత్‌కు నష్టం కలిగిందని రుజువు చేసే ఒక్క ఫొటో అయినా చూపించగలరా.. అజిత్ ధోవల్ సవాల్
Mallikarjun Kharge: రాజ్యాంగం నుంచి సెక్యులర్, సోషలిజం పదాలను తొలగిస్తున్న బీజేపీ : ఖర్గే
Priya Nair | హెచ్‌యూఎల్‌కు తొలిసారి మహిళా నాయకత్వం.. ఇంతకీ ఎవరీ ప్రియా నాయర్..?