న్యూఢిల్లీ: ముంబై మాజీ మేయర్, శివసేన (ఉద్ధవ్ థాక్రే) నాయకురాలు కిశోరీ పడ్నేకర్పై (Kishori Pednekar) చీటింగ్ కేసు నమోదయింది. స్లమ్ రిహాబిలిటేషన్ అథారిటీ (SRA) ఆధ్వర్యంలో మహారాష్ట్ర ప్రభుత్వం వర్లీలో నిర్మించిన ప్లాట్లను కొనుగోలు చేశారనే ఆరోపణలపై పడ్నేకర్తోపాటు మరో ముగ్గురిపై పోలీసులు కేసు రిజిస్టర్ చేశారు. గోమాతా జనతా ఎస్ఆర్ఏ సొసైటీలో ఉన్న ఫ్లాట్లను ఓ ప్రైవేటు సంస్థకు చెందిన అధికారులతో కలిసి మాజీ మేయర్ అక్రమంగా కొనుగోలు చేశారని ఎస్ఆర్ఏ అధికారి ఉదయ్ పింగ్లే తెలిపారు.
గంగారామ్ బోగా అనే వ్యక్తి నుంచి గోమాతా సొసైటీలో పడ్నేకర్ ఫ్లాట్‌ను కొనుగోలు చేశారని వెల్లడించారు. 2008లో ఆ ఫ్లాట్ బోగా కేటాయించడం జరిగిదని, అయితే 2017లో జరిగిన బ్రిహిన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సందర్భంగా పడ్నేకర్ అది తన ఆస్తిగా చూపించారని తెలిపారు. ఇలాగే మరో యూనిట్‌ను కూడా సొంతం చేసుకున్నారని చెప్పారు.