అహ్మదాబాద్: ఒక కాంగ్రెస్ నేత కుర్చీని పక్కకు లాగారు. దీంతో తిరిగి కూర్చోబోయిన దళిత మహిళా పోలీస్ అధికారిణి కిందపడింది. ఆమె స్వల్పంగా గాయపడింది. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ సంఘటన నేపథ్యంలో ఆ కాంగ్రెస్ నేతపై పోలీసులు కేసు నమోదు చేశారు. (Case Against Congress Leader) గుజరాత్‌లోని కచ్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. శనివారం భుజ్‌లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే జిగ్నేష్ మేవానీ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఆ రాష్ట్ర ఇంటెలిజెన్స్ బ్యూరోకు చెందిన మహిళా పోలీస్ అధికారిణి రీనా చౌహాన్ సివిల్ డ్రెస్‌లో విధుల్లో పాల్గొన్నది. కుర్చీ నుంచి పైకి లేచిన ఆమె వేదికపై కూర్చొన్న వారిని ఫొటో తీసింది.
కాగా, కాంగ్రెస్ కిసాన్ సెల్ కోఆర్డినేటర్ హరేష్ అహిర్ మహిళా పోలీస్ అధికారిణి కుర్చీని వెనక్కి లాగారు. దీంతో ఆ కుర్చీపై తిరిగి కూర్చోబోయిన రీనా చౌహాన్ కిందపడింది. స్వల్పంగా గాయపడిన ఆమె పైకి లేచిన తర్వాత హరేష్ అహిర్ చర్యపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆమె ఫిర్యాదుతో ఆయనపై ఎస్సీ, ఎస్టీ చట్టంతోపాటు పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.
మరోవైపు హోంశాఖ సహాయ మంత్రి హర్ష్ సంఘవి ఈ ఘటనను ఖండించారు. ఈ వీడియో క్లిప్‌ను ఎక్స్‌లో షేర్ చేశారు. మహిళలు, దళితులకు కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకమని విమర్శించారు. అయితే దళితులపై హత్యలు, అత్యాచారాలు, వారి భూముల కబ్జాపై నోరు ఎత్తని, కేసులు నమోదు చేయని హోంమంత్రిని బట్టబయలు చేసేందుకు కాంగ్రెస్ కార్యకర్త ప్రయత్నించారని ఎమ్మెల్యే జిగ్నేష్ మేవానీ తెలిపారు. ఈ నేపథ్యంలో ఆయనను టార్గెట్ చేసేందుకు మహిళా ఐబీ అధికారిని బీజేపీ ప్రభుత్వం వినియోగించిందని ఆయన ఆరోపించారు.
कोंग्रेस की मानसिकता हमेशा से महिला एवं दलित विरोधी रही है।
आज गुजरात कोंग्रेस के विधायक जिग्नेश मेवानी की प्रेस कॉन्फ्रेंस के दौरान उनके अजीज मित्र कच्छ कोंग्रेस के नेता H.S.Aahir के द्वारा देखे किस प्रकार से जानबूझ के कुर्शी खींचकर एक दलित महिला ऑफिसर को घायल किया गया।
यह… pic.twitter.com/3v2mMVdqaE
— Harsh Sanghavi (@sanghaviharsh) August 3, 2024