న్యూఢిల్లీ, నవంబర్ 22: రాజ్యంగ పీఠికలో సామ్యవాద, లౌకిక అనే పదాలను చేర్చడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టులో విచారణ పూర్తయ్యింది. మాజీ ఎంపీ సుబ్రమణ్యస్వామితో పాటు పలువురు వేసిన పిటిషన్లను సీజేఐ సంజీవ్ ఖన్నాతో కూడిన ధర్మాసనం విచారించి, తీర్పును నవంబర్ 25కు వాయిదా వేసింది. ఎమర్జెన్సీలో పార్లమెంట్లో చేసినవన్నీ తప్పులని చెప్పలేమని ధర్మాసనం పేర్కొంది. రాజ్యాంగాన్ని సవరించే అధికారం పార్లమెంటుకు 368వ అధికరణ కట్టబెట్టిందని, పీఠిక కూడా రాజ్యంగంలో భాగమేనని కోర్టు పేర్కొన్నది.