న్యూఢిల్లీ, ఏప్రిల్ 13: నకిలీ, నాణ్యతలేని మందులను తయారుచేస్తున్న ఫార్మా కంపెనీలపై కేంద్ర సర్కారు కొరడా ఝులిపించింది. దేశవ్యాప్తంగా 18 ఫార్మా కంపెనీల లైసెన్సులను రద్దు చేసింది.దేశవ్యాప్తంగా 20 రాష్ర్టాల్లోని 76 కంపెనీలపై డీసీజీఐ తనిఖీలు చేపట్టింది. మొత్తం 18 కంపెనీలు నాణ్యతలేని మందులను ఉత్పత్తి చేస్తున్నట్టు గుర్తించింది.
అలాగే, హిమాచల్‌ప్రదేశ్‌లోని 70, ఉత్తరాఖండ్‌లోని 45, మధ్యప్రదేశ్‌లోని 23 కంపెనీలపై చర్యలు తీసుకొన్నట్టు అధికార వర్గాలు వెల్లడించాయి. పలు కంపెనీలకు షోకాజ్ నోటీసులు ఇచ్చినట్టు తెలిపాయి. నకిలీ, నాణ్యతలేని మందులను తయారుచేస్తున్న కంపెనీల్లో అధికంగా ఉత్తరాఖండ్, హిమాచల్‌ప్రదేశ్‌లోనే ఉన్నట్టు పేర్కొన్నాయి.