న్యూఢిల్లీ : స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై భారత్తో జరగాల్సిన చర్చల్ని వాయిదా వేస్తున్నామని కెనడా సంచలన ప్రకటన చేసింది. ఇందుకుగల కారణాన్ని కెనడా అధికారులు వెల్లడించలేదు. షెడ్యూల్ ప్రకారం ఈ ఒప్పందంపై ఇరు దేశాల మధ్య అక్టోబర్లో చర్చలు జరగాల్సి వుంది. అయితే ఖలిస్థాన్ వేర్పాటువాద ఉద్యమానికి కెనడా వేదికగా మారడంపై ఇటీవల భారత్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో జీ20 సదస్సు కోసం న్యూఢిల్లీకి వచ్చిన కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో భారత ప్రధాని మోదీతో అంటీముట్టనట్టుగా వ్యవహరించారు. దీంతో ఇరు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నట్టు వార్తలు వెలువడ్డాయి.