హైదరాబాద్: 2వేల నోట్‌ను ఆర్బీఐ ఉపసంహరించడంతో.. కస్టమర్ల అనేక రకాల అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. సెప్టెంబర్ 30వ తేదీ వరకు ఆ నోట్లను బ్యాంకుల్లో సమర్పించాలని ఆర్బీఐ ఆదేశించిన విషయం తెలిసిందే. మరి ఈ సమయంలోగా ఆ నోట్లను లావాదేవీల కోసం వాడుకోవచ్చా లేదా అన్న విషయంపై ఆర్బీఐ క్లారిటీ ఇచ్చింది.
2వేల నోట్‌ను విత్‌డ్రా చేసినా.. ఆ నోట్లను నార్మల్ లావాదేవీల (Normal Transactions) కోసం వాడుకోవచ్చు అని ఆర్బీఐ తెలిపింది. ప్రజలు తమ వద్ద ఉన్న 2వేల నోట్లను లావాదేవీల కోసం వినియోగించడమే కాకుండా ఆ నోట్లను పేమెంట్ రూపంలో అందుకోవచ్చు అని ఆర్బీఐ స్పష్టం చేసింది. కానీ ఆ నోట్లను మాత్రం సెప్టెంబర్ 30వ తేదీలోగా బ్యాంకుల్లో డిపాజిట్ చేయాల్సి ఉంటుంది.
₹2000 Denomination Banknotes – Withdrawal from Circulation; Will continue as Legal Tenderhttps://t.co/im8EBo42Wk
— ReserveBankOfIndia (@RBI) May 22, 2023