న్యూఢిల్లీ, ఫిబ్రవరి 9: రాజ్యాంగాన్ని ఆమోదించిన 1949, నవంబర్ 26వ తేదీని మార్చకుండా రాజ్యాంగ పీఠికను సవరించొచ్చా అని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. రాజ్యాంగ పీఠిక నుంచి సెక్యులర్, సోషలిస్ట్ పదాలను తొలగించాలని కోరుతూ మాజీ ఎంపీ సుబ్రమణ్యస్వామి, న్యాయవాది విష్ణుకుమార్ జైన్ దాఖలు చేసిన పిటిషన్పై కోర్టు ఈ మేరకు స్పందించింది.
అకడమిక్ పర్పస్ కోసం తేదీని మార్చకుండా పీఠికను సవరించొచ్చు అని, అందులో ఎలాంటి సమస్య ఉండదని జస్టిస్ దత్తా పేర్కొన్నారు. దీనిపై సుబ్రమణ్యస్వామి స్పందిస్తూ.. ఈ విషయంలో అదే అసలు ప్రశ్న అని అన్నారు. రాజ్యాంగ పీఠిక నిర్దిష్ట తేదీతో వస్తుంది కాబట్టి, చర్చ లేకుండా దానిని సవరించలేమని జైన్ పేర్కొన్నారు. తదుపరి విచారణను కోర్టు ఏప్రిల్ 29కి వాయిదా వేసింది.