Driving License: ఎల్ఎంవీ డ్రైవింగ్ లైసెన్సుపై క్లారిటీ కోరిన సుప్రీంకోర్టు
Driving License: డ్రైవింగ్ లైసెన్సుల గురించి ఇవాళ సుప్రీంలో విచారణ జరిగింది. ఎల్ఎంవీ లైసెన్సు ఉన్నవాళ్లు ట్రాన్స్పోర్టు వాహనాలు నడపవచ్చా. దీనిపై రెండు నెలల్లోగా రిపోర్టు ఇవ్వాలని కేంద్రాన్ని సుప్రీం కోరింది. సీజే చంద్రచూడ్ నేతృత్వంలోని అయిదుగురు సభ్యుల ధర్మాసనం ఈ కేసును విచారిస్తున్నది.
న్యూఢిల్లీ: లైట్ మోటార్ వెహికల్స్ కోసం డ్రైవింగ్ లైసెన్సు(Driving License) తీసుకున్న వారు.. సుమారు 7500 కేజీల బరువున్న ట్రాన్స్పోర్టు వాహనాల్ని నడపాలా వద్దా అన్న అంశంపై ఇవాళ సుప్రీంకోర్టులో వాదనలు జరిగాయి. దీనిపై కేంద్ర ప్రభుత్వం ఓ విధాన నిర్ణయాన్ని తీసుకోవాలని సూచన చేసింది. డ్రైవింగ్ లైసెన్సులకు సంబంధించిన అంశం.. లక్షలాది మంది ప్రజలపై ప్రభావం చూపిస్తుందని చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేపథ్యంలోని సుప్రీం ధర్మాసనం పేర్కొన్నది. ఎల్ఎంవీ లైసెన్సు ఉన్నవాళ్లు.. ఎటువంటి వాహనాల్ని నడపాలన్న దానిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలన్నారు. రెండు నెలల్లోగా దీనిపై నిర్ణయం తీసుకుని కోర్టుకు విన్నవించాలని సీజే తెలిపారు.
రోడ్డు భద్రత, పబ్లిక్ ట్రాన్స్పోర్టు భద్రతకు సంబంధించిన విషయాలను కూడా పరిగణలోకి తీసుకోవాలని సుప్రీంకోర్టు తెలిపింది. ఎల్ఎంవీ లైసెన్సు ఉన్నవాళ్లు.. ట్రాన్స్పోర్టు వాహనం నడపవచ్చా అన్న విషయంపై అటార్నీ జనరల్ ఆర్ వెంకటరమణి సూచనల్ని సుప్రీంకోర్టు తీసుకున్నది. ఈ అంశంపై సుప్రీంలో మొత్తం 76 పిటీషన్లు నమోదు అయ్యాయి. సుప్రీం ధర్మాసనంలో జస్టిస్ హృషికేశ్ రాయ్, పీఎస్ నర్సింహా, పంకజ్ మిటల్, మనోజ్ మిశ్రా ఉన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ranabaali | రణబాలి ట్విట్టర్ రివ్యూ.. విజయ్ దేవరకొండ నటనకు ప్రశంసలు, కథనంపై మిశ్రమ స్పందన!
Bigg Boss 10 | బిగ్బాస్లో షాలిని, రోహిత్ మధ్య బ్రేకప్ వార్.. టాస్క్లో ఓటమితో వంశీ కన్నీళ్లు!
Caller ID | కాలర్ పేరు ప్రదర్శించడం తప్పనిసరి.. టెలికం కంపెనీలకు కేంద్రం ఆదేశం
Paper Leak | 8 ఏండ్లుగా పేపర్ లీక్లే లేవట.. NTAపై కేంద్ర విద్యా శాఖ నివేదిక
Reservations | మతం మారితే రిజర్వేషన్ వర్తించదు.. సుప్రీంకోర్టు కీలక తీర్పు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

