
న్యూఢిల్లీ: ఒక నిందితుడికి మంజూరైన బెయిల్ విషయంలో జోక్యం చేసుకునేప్పుడు నేర తీవ్రత, నిందితుడి ప్రవర్తన తీరు, సామాజిక ప్రభావం వంటి అంశాలను దృష్టిలో ఉంచుకోవాలని సుప్రీంకోర్టు పేర్కొంది. బెయిల్‌ను రద్దు చేయడానికి బలమైన కారణం ఉండాలని స్పష్టంచేసింది. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకుని న్యాయవిఘాతం కలుగకుండా నివారించేందుకు బెయిల్ ఆదేశాల్లో సుప్రీంకోర్టు జోక్యం చేసుకుంటుందని చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం తెలిపింది. ఈ మేరకు వరకట్న మృతి కేసులో ఒక మహిళకు మంజూరైన ముందస్తు బెయిల్‌ను రద్దు చేసింది. సీజేఐ జస్టిస్ రమణ నేతృత్వంలోని కొలీజియం సిఫారసుచేసిన 68 మంది పేర్లలో పలువురికి త్వరలోనే కేంద్రం ఆమోదం తెలుపనున్నట్టు సమాచారం.