పాట్నా : బీహార్ శాసనసభ తొలి దశ ఎన్నికల ప్రచారం మంగళవారం సాయంత్రం 6 గంటలకు ముగిసింది. చివరి రోజు ఓటర్లను ఆకట్టుకోవడానికి పార్టీలు ముమ్మర ప్రచారం నిర్వహించాయి. ఈ నెల 6న 121 స్థానాల్లో తొలి దశ పోలింగ్ జరగనుంది.
ఆర్జేడీ అగ్ర నేత తేజస్వి యాదవ్, ఆయన సోదరుడు తేజ్ ప్రతాప్ యాదవ్, డిప్యూటీ సీఎంలు సామ్రాట్ చౌదరి, విజయ్ కుమార్ సిన్హా, గాయని మైథిలి ఠాకూర్, గూండా నుంచి రాజకీయ నాయకుడిగా మారిన షాబుద్దీన్ కొడుకు ఒసామా షహబ్ పోటీ చేస్తున్న స్థానాలు తొలి విడత పోలింగ్లో ఉన్నాయి.