ముంబై : బీజేపీ పాలిత మహారాష్ట్రలో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ముఖ్యమంత్రి మాఝీ లడ్కీ బహిన్ యోజన పథకంలో రూ.3,541 కోట్ల అక్రమాలు జరిగినట్టు కాగ్ గుర్తించింది. 2021-25 నిర్దేశించిన నిధుల కంటే అదనంగా మంజూరు చేశారని.. వాటికి సరైన లెక్కలు చూపించడంలో మహిళా శిశు సంక్షేమ శాఖ ఫెయిల్ అయిందని కాగ్ తన నివేదికలో వెల్లడించింది.
కాగ్ నివేదిక ప్రకారం.. 2024-25లో మహారాష్ట్ర ప్రభుత్వం ఈ పథకం కోసం రూ.15,586 కోట్ల నిధులను వెంటనే వినియోగించకుండా వర్చువల్ పర్సనల్ డిపాజిట్ అకౌంట్లకు తరలించింది. ఇది కేటాయింపుల నిబంధనలకే విరుద్ధం. ఈ పథకంలో భాగంగా 21 ఏండ్ల నుంచి 65 ఏండ్ల వయసున్న మహిళలకు నెలకు రూ.1500 అకౌంట్లలో వేస్తారు. దీని కోసం వాస్తవ ఖర్చుగా రూ.33,237 కోట్లను చూపించారు. కానీ అదనంగా రూ.3541 కోట్ల ఖర్చుకు సరైన ఆధారాలు చూపించలేదని కాగ్ తన నివేదికలో వెల్లడించింది.