న్యూఢిల్లీ: అమర్నాథ్ యాత్రికుల కోసం కేబుల్ కారును అందుబాటులోకి తేవాలని కేంద్రం నిర్ణయించింది. 2029 నాటికి ఈ ప్రాజెక్ట్ పూర్తి చేయాలని భావిస్తున్నది. ఈ సదుపాయం అందుబాటులోకి వస్తే 13 వేల అడుగుల ఎత్తులోని అమర్నాథ్ గుహకు చేరుకొనే ప్రయాణ సమయం 5-8 గంల నుంచి 25-30 నిమిషాలకు తగ్గుతుంది. 11.6 కిలో మీటర్ల మేర సంగం వరకు కేబుల్ కార్ మార్గాన్ని నిర్మిస్తారు.