Ali | రైతు ఉంటేనే దేశం నిలబడుతుంది.. ‘హే చికీతా’ ఈవెంట్లో అలీ
Ali | పవన్ కల్యాణ్ మ్యానరిజంను స్పూర్తిగా తీసుకొని డైరెక్టర్ ధన్ రాజ్ లెక్కల తెరకెక్కిస్తున్న చిత్రం ‘హే చికీతా’. అభినవ్ మణికంఠ, దివిజ హీరోహీరోయిన్లుగా నటిస్తుండగా.. ప్రభాకర్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ చిత్రాన్ని జులై 24న విడుదల చేస్తున్నారు. ఓ వైపు లవ్, రిలేషన్స్, మరోవైపు వ్యవసాయం వంటి అంశాలను సినిమాలో చూపించబోతున్నట్టు టీజర్ చెబుతోంది.
Ali | పవన్ కల్యాణ్ మ్యానరిజంను స్పూర్తిగా తీసుకొని డైరెక్టర్ ధన్ రాజ్ లెక్కల తెరకెక్కిస్తున్న చిత్రం ‘హే చికీతా’. అభినవ్ మణికంఠ, దివిజ హీరోహీరోయిన్లుగా నటిస్తుండగా.. ప్రభాకర్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ చిత్రాన్ని జులై 24న విడుదల చేస్తున్నారు. ఓ వైపు లవ్, రిలేషన్స్, మరోవైపు వ్యవసాయం వంటి అంశాలను సినిమాలో చూపించబోతున్నట్టు టీజర్ చెబుతోంది.
ప్రీ రిలీజ్ ఈవెంట్లో అలీ మాట్లాడుతూ.. బద్రి సినిమాలో హే చికీతా పాట ఏ రేంజ్లో హిట్టయ్యిందో ఈ మూవీ కూడా అంతే హిట్టవ్వాలని కోరుకుంటున్నానన్నాడు. ఓ సినిమాను తీయడం, విడుదల చేయడం ఎంత కష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సినిమాలో విషయముంటే ప్రేక్షక దేవుళ్లు నెత్తిన పెట్టుకుని చూస్తారు. భవిష్యత్‌లో రైతు అనేవాడు ఉంటాడా..? కనిపిస్తాడా..? అనిపిస్తుంది. రైతు ఉంటేనే దేశం నిలబడుతుంది. రైతు మీద, యూత్ మీద తీసిన ఈ సినిమా మంచి హిట్టవ్వాలని అలీ ఆకాంక్షించాడు.
ఇది నా మొదటి సినిమా. రైతులు, యువత కోసం ఈ సినిమా చేశాను. సినిమాలో అంజి మామ, అజయ్పాత్రలు అందరినీ నవ్విస్తాయని డైరెక్టర్ ధన్‌రాజ్ లెక్కల అన్నాడు. రామ్ లక్ష్మణ్ మాస్టర్స్ మాట్లాడుతూ.. పల్లెటూరులో చాలా ప్రేమకథలుంటాయి. ఈ మూవీ పోస్టర్‌ను చూస్తుంటూ మా ఊరిలో ఉన్న రోజులు గుర్తుకొచ్చాయని రు. రైతుపంట పండిస్తేనే మనం ఇలా జీవిస్తున్నాం. రైతే రాజు అనే కాన్సెప్ట్‌తో వస్తున్న ఈ సినిమా మంచి సక్సెస్ అందుకోవాలని ఆకాంక్షించారు.
సుందరకాండ మోషన్ పిక్చర్స్, ఎల్ఎల్పీ బ్యానర్లపై గరుడ వేగ ఫేం అంజి, ఎన్ అశోక్ ఆర్ఎన్ఎస్ సంయుక్తంగా ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఈ మూవీలో తన్మయి కుషి, దేవీ ప్రసాద్, బలగం సుజాత, అంజిమామ ఇతర నటీనటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.
The wait is over! Hyy Chikittha Pre Release Event is LIVE NOW! Watch it unfold! 🔥
In Cinemas Worldwide – July 24, 2026
🔗: https://t.co/J71RLUOcZo#HyyChikitthaTrailer #HyyChikitthaPreRelease@SKMPictures#AmaravatiMovieMakers #SundarakandaMotionPictures@abhinavactor06… pic.twitter.com/1zG5A0QLKH
— BA Raju’s Team (@baraju_SuperHit) July 17, 2026
Read Also :
Skyroot Aerospace: కక్ష్యలోకి ప్రైవేటు రాకెట్ పంపిన మూడో దేశం మనదే: స్కైరూట్ ఏరోస్పేస్
Yuva Sangrama Sadassu | ఎండ్రిన్ తాగాల్సింది మేం కాదు.. నువ్వు.. సీఎం రేవంత్ రెడ్డిపై నిరుద్యోగ యువతి ఫైర్
‘విద్యార్థులు సాంకేతిక విద్యను సద్వినియోగం చేసుకోవాలి’
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

