న్యూఢిల్లీ: కోల్, లిగ్నైట్ గ్యాసిఫికేషన్ ప్రాజెక్టుల అభివృద్ధికి రూ.8,500 కోట్ల ఆర్థిక సాయాన్ని కేంద్ర ప్రభుత్వం బుధవారం ఆమోదించింది. కోల్-టు-ఎస్ఎన్జీ (సింథటిక్ నేచురల్ గ్యాస్) ప్రాజెక్టు ఏర్పాటుకు పచ్చ జెండా ఊపింది.
కోల్ ఇండియా లిమిటెడ్ (సీఐఎల్), గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (జీఏఐఎల్) కలిసి రూ.13,052.81 కోట్ల పెట్టుబడితో ఈ ప్రాజెక్టును ఏర్పాటు చేస్తాయి.