పంజాబ్లో రేపే మంత్రివర్గ ప్రమాణ స్వీకారం.. డిప్యూటీ సీఎంగా హర్పాల్ సింగ్
పంజాబ్లో మంత్రివర్గ ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఫిక్స్ అయ్యింది. శనివారం ఉదయం 11 గంటలకు మంత్రి వర్గ ప్రమాణ స్వీకారం ఉంటుందని ఆప్ నేతలు అంటున్నారు. ఈ కార్యక్రమం అనంతరం ఒంటి గంటకు సీఎం భగవంత్ మాన్ అధ్యక్షతన మొదటి కేబినెట్ సమావేశం జరగనుంది. అయితే ఎవరెవర్ని మంత్రివర్గంలోకి తీసుకోవాలో సీఎం భగవంత్ మాన్ ఇష్టానికే కేజ్రీవాల్ వదిలేసినట్లు తెలుస్తోంది. మంత్రివర్గ విషయంలో తమ జోక్యం ఉండదని కేజ్రీవాల్ తేల్చిచెప్పినట్లు ఆప్ వర్గాలు అంటున్నాయి. క్లిష్ట సమయంలో పార్టీ వెన్నంటే వున్న వారు, పూర్తి నమ్మకస్తులను మాత్రమే భగవంత్ మాన్ తన మంత్రివర్గంలోకి తీసుకోనున్నారు.
ఇక… పంజాబ్ ఆమ్ఆద్మీలో అత్యంత ముఖ్యుడైన హర్పాల్ సింగ్ చీమాను డిప్యూటీ సీఎంగా ఎంపిక చేయనున్నట్లు తెలుస్తోంది. పంజాబ్లో ఆప్ పాతుకుపోవడంలో ఈయనది కీలక పాత్ర. ఈ విషయాన్ని సీఎం భగవంత్మాన్, అధిష్ఠానం గుర్తించే, ఆయనకు డిప్యూటీ సీఎంగా ఛాన్స్ ఇవ్వనున్నారు. ఇక.. అమన్ అరోడా, కుల్తార్ సింగ్ సంఘవాంను కచ్చితంగా మంత్రివర్గంలోకి తీసుకుంటారని సమాచారం.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

