న్యూఢిల్లీ: ఈ నెల 9 నుంచి 14 మధ్య జరగాల్సిన సీఏ పరీక్షలను చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ఐసీఏఐ) వాయిదా వేసింది. ఫైనల్, ఇంటర్మీడియెట్, పోస్ట్ క్వాలిఫికేషన్ పరీక్షలను వాయిదా వేస్తున్నట్టు శుక్రవారం ప్రకటించింది. దేశంలో భద్రతా పరమైన ఉద్రిక్తతలు నెలకొనడంతో పరీక్షలను వాయిదా వేస్తున్నట్టు తెలిపింది.
త్వరలోనే మళ్లీ తేదీలను ప్రకటిస్తామని పేర్కొంది. మొత్తం 55,666 మంది విద్యార్థులు ఫైనల్ పరీక్షలకు, 1,02,378 మంది ఇంటర్మీడియెట్ పరీక్షలకు హాజరు కావాల్సి ఉంది.