న్యూఢిల్లీ: షాపులోకి ప్రవేశించిన ఒక వ్యక్తి వ్యాపారవేత్తపై గన్‌తో కాల్పులు జరిపాడు. (Businessman Shot Dead) ఈ సంఘటనలో ఆ షాపు యాజమాని మరణించాడు. ఆ షాపులోని సీసీటీవీలో రికార్డైన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దేశ రాజధాని ఢిల్లీలో ఈ సంఘటన జరిగింది. 32 ఏళ్ల సూరజ్‌కు కబీర్‌నగర్‌లో ట్యాప్స్, పెయింట్స్ షాపు ఉంది. బుధవారం ఉదయం 8.40 గంటల సమయంలో అతడు షాపు తెరిచి లోనికి వెళ్లాడు. అయితే స్కూటర్‌పై వచ్చిన ఒక వ్యక్తి అతడ్ని అనుసరించాడు. సూరజ్‌పై గన్‌తో నాలుగు రౌండ్లు కాల్పులు జరిపి హత్య చేశాడు. అనంతరం అక్కడి నుంచి పారిపోయాడు.
కాగా, ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆ షాపులోని సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించారు. నిందితుడ్ని గుర్తించి అరెస్ట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆటో డ్రైవర్ల నుంచి వసూళ్ల నేపథ్యంలో ఈ హత్య జరిగినట్లు అనుమానిస్తున్నారు. గత నెలలో సూరజ్ స్నేహితుడు కూడా కాల్పుల్లో మరణించినట్లు పోలీసులు తెలిపారు. మరోవైపు సీసీటీవీలో రికార్డైన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
VIDEO | CCTV footage of a murder that took place in North East Delhi on Wednesday. More details awaited.
(Source: Third Party) pic.twitter.com/cK2mbBWv7G
— Press Trust of India (@PTI_News) May 30, 2024