నేపాల్ నుంచి వస్తున్న బస్సు బోల్తా.. 60 మంది భారత యాత్రికులకు గాయాలు
బస్సు ప్రమాదం గురించి తెలుసుకున్న నేపాల్ పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడిన భారతీయ భక్తులను నేపాల్‌లోని నావల్ పరాసి జిల్లాలో ఉన్న పృథ్వీ చంద్ జిల్లా ఆసుపత్రికి తరలించారు.
లక్నో: నేపాల్ నుంచి భారత్‌కు తిరిగి వస్తున్న బస్సు బోల్తాపడింది. ఈ ప్రమాదంలో సుమారు 60 మంది భారత యాత్రికులు గాయపడ్డారు. ఉత్తరప్రదేశ్ గొరఖ్‌పూర్ జిల్లాలోని పిపిగంజ్కు చెందిన 70 మంది భక్తులు నేపాల్‌లోని త్రివేణి ధామ్‌కు బస్సులో వెళ్లారు. తిరిగి వస్తుండగా నేపాల్, భారత్ సరిహద్దులోని తితుబారి ప్రాంతం వద్ద ఆ బస్సు అదుపుతప్పింది. రోడ్డు పక్కన ఉన్న గుంతలోకి దూసుకెళ్లింది. దీంతో బస్సు ఒక పక్కకు ఒరిగిపోయింది. బస్సులోని 70 మంది యాత్రికుల్లో 60 మంది గాయపడ్డారు.
కాగా, బస్సు ప్రమాదం గురించి తెలుసుకున్న నేపాల్ పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడిన భారతీయ భక్తులను నేపాల్‌లోని నావల్ పరాసి జిల్లాలో ఉన్న పృథ్వీ చంద్ జిల్లా ఆసుపత్రికి తరలించారు.
మరోవైపు ఉత్తరప్రదేశ్‌లోని మహారాజ్‌గంజ్ జిల్లా కలెక్టర్ కూడా బస్సు ప్రమాదంపై స్పందించారు. గాయపడిన యాత్రికుల గురించి నేపాల్ అధికారులతో ఫోన్లో మాట్లాడారు. అలాగే గాయపడిన వారికి సహాయం కోసం అధికారులను కూడా నేపాల్‌కు పంపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Bus
- Indian pilgrims
- Nepal
- overturns
RELATED ARTICLES
తాజా వార్తలు
Nana Patekar | గుండెపోటుతోనే నానాపటేకర్ మరణం.. పోస్టుమార్టం నివేదికలో వెల్లడి
Athletics | అథ్లెటిక్స్‌లో యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ
New Delhi | న్యూఢిల్లీలో ఉద్రిక్తత.. ఆందోళనకారులతోపాటు జర్నలిస్టుల్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు
Delhi Police | దీప్కేకు అతడి నానమ్మ మరణవార్తను వెంటనే తెలియజేశాం : ఢిల్లీ పోలీసులు
BRS Councilors | మున్సిపల్ కమిషనర్ తీరుపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తాం : బీఆర్ఎస్ కౌన్సిలర్స్
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

