న్యూఢిల్లీ: జమ్ము కశ్మీర్‌లోని ఉధంపూర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో సుమారు 22 మంది మృతి చెందగా, మరో 30 మంది తీవ్రంగా గాయపడ్డారు. సోమవారం ఉదయం పది గంటలకు రామ్‌నగర్ నుంచి ఉధంపూర్‌కు బయల్దేరిన ట్రావెల్ బస్సు కాగోర్ట్ వద్దకు రాగానే ఓ మూల మలుపు తిరిగే సమయంలో ప్రమాదవశాత్తు లోయలో పడిపోయింది. దీంతో బస్సులో ప్రయాణిస్తున్న 22 మంది మృతి చెందగా, మరో 30 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను సమీపంలోని దవాఖానకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రతి మృతుడి కుటుంబానికీ ప్రధాని రూ.2 లక్షల చొప్పున ఆర్థిక సాయాన్ని ప్రకటించారు.