Watch: మిడిల్ ఫింగర్ చూపించిన బైకర్.. చితక్కొట్టిన బస్సు డ్రైవర్
ఆర్టీసీ బస్సు డ్రైవర్ మరో బస్సును ఓవర్ టేక్ చేసేందుకు ప్రయత్నించాడు. అయితే బైక్‌పై వెళ్తున్న సందీప్ దారి ఇవ్వలేదు. బస్సు డ్రైవర్ ఓవర్ టేక్ చేయగా అతడు మిడిల్ ఫింగర్‌ను పైకి చూపాడు.
బెంగళూరు: ఓవర్ టేక్ చేసిన బస్సు డ్రైవర్‌కు బైక్‌పై వెళ్తున్న వ్యక్తి మిడిల్ ఫింగర్ చూపించాడు. దీంతో ఆగ్రహించిన బస్సు డ్రైవర్ ఆ బైకర్‌ను చితకబాదాడు. కర్ణాటక రాజధాని బెంగళూరులో ఈ సంఘటన జరిగింది. 44 ఏళ్ల సందీప్ అనే వ్యక్తి మంగళవారం మధ్యాహ్నం తన భార్యతో కలిసి బైక్‌పై వెళ్తున్నాడు. యలహంక ప్రాంతంలో కర్ణాటక ఆర్టీసీ బస్సు డ్రైవర్ మరో బస్సును ఓవర్ టేక్ చేసేందుకు ప్రయత్నించాడు. అయితే బైక్‌పై వెళ్తున్న సందీప్ దారి ఇవ్వలేదు. బస్సు డ్రైవర్ ఓవర్ టేక్ చేయగా అతడు మిడిల్ ఫింగర్‌ను పైకి చూపాడు.
దీంతో బైక్‌ను అడ్డగించి బస్సు ఆపిన డ్రైవర్ బైక్ కీ, సందీప్ మొబైల్ ఫోన్ తీసుకుని బస్సులోకి వెళ్లాడు. సందీప్ కూడా బస్సు డ్రైవర్‌ను అనుసరించాడు. ఈ సందర్భంగా వారిద్దరి మధ్య వాగ్వాదం, ఘర్షణ జరిగింది. ఆగ్రహం పట్టలేని ఆ బస్సు డ్రైవర్ సందీప్‌ను ఇష్టానుసారంగా కొట్టాడు. సందీప్ భార్య, బస్సులోని ప్రయాణికులు డ్రైవర్‌ను నిలువరించేందుకు ప్రయత్నించినా అతడు తగ్గలేదు. డ్రైవర్ దాడిలో గాయపడిన సందీప్ దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అనంతరం అతడ్ని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు.
మరోవైపు బస్సు డ్రైవర్ కూడా సందీప్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తనకు మిడిల్ ఫింగర్ చూపించాడని ఆరోపించాడు. దీంతో ఇద్దరి ఫిర్యాదులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా బస్సులోని ఒక ప్రయాణికుడు తన మొబైల్ ఫోన్లో రికార్డు చేసిన డ్రైవర్ దాడి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో ప్రభుత్వ బస్సును నడుపుతున్న ఆ డ్రైవర్‌ను నియమించిన ప్రైవేట్ సంస్థ అతడ్ని ఉద్యోగం నుంచి తొలగించింది.
Road Rage in #Bengaluru: A #biker was #assaulted by a #BMTC #bus driver for being in the way while overtaking another bus in #Yelahanka.
The driver, who alleged he was shown the middle-finger by the biker, has been suspended. @NammaBengaluroo @WFRising pic.twitter.com/9lLVFhPvZK
— Rakesh Prakash (@rakeshprakash1) November 24, 2022
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Beats Up
- Bengaluru
- biker
- Bus driver
RELATED ARTICLES
తాజా వార్తలు
Donald Trump | రష్యా- అమెరికా డీజిల్ ఒప్పందాన్ని తప్పుబట్టిన జెలెన్స్కీ.. ఉక్రెయిన్‌కు కొత్త అధ్యక్షుడు అవసరమన్న ట్రంప్
Bathukamma | బతుకమ్మ పండుగకు కనీస ఏర్పాట్లు చేయని కాంగ్రెస్ సర్కార్.. వీడియో
Patnam Narendar Reddy | పట్టభద్రులు ఓటర్ల జాబితాలో తమ పేర్లను నమోదు చేయించుకోవాలి : మాజీ ఎమ్మెల్యే పట్నం
Maganur | షార్ట్ సర్య్కూట్‌తో ఇళ్లు దగ్ధం..పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే
Chennai Metro | చెన్నైలో మెట్రో నూతన మార్గం ప్రారంభం.. ప్రధాని మోదీ, సీఎం విజయ్ తొలి ప్రయాణం..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

