Bus Accident | పెళ్లి బృందంతో వెళ్తున్న బస్సు బోల్తా.. ఐదుగురు మృతి, 15 మందికి గాయాలు
Bus Accident | పెళ్లి బృందం ప్రయాణిస్తున్న బస్సు ప్రమాదానికి (Bus Accident) గురైంది. అది బోల్తా పడటంతో ఐదుగురు వ్యక్తులు మరణించారు. గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో ఆ బస్సు బోల్తా పడినట్లు పోలీసులు తెలిపారు. ప్రమాద సమయంలో బస్సులో 40 మంది వ్యక్తులు ఉన్నట్లు చెప్పారు.
లక్నో: పెళ్లి బృందం ప్రయాణిస్తున్న బస్సు ప్రమాదానికి (Bus Accident) గురైంది. అది బోల్తా పడటంతో ఐదుగురు వ్యక్తులు మరణించారు. మరో 15 మంది గాయపడ్డారు. ఉత్తరప్రదేశ్లోని జలౌన్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. 40 మంది పెళ్లి బృందంతో వెళ్తున్న బస్సును మధుఘర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గోపాల్పురా సమీపంలో శనివారం రాత్రి గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. దీంతో ఆ బస్సు రోడ్డు దిగువన బోల్తా పడింది. అందులో ప్రయాణిస్తున్న పెళ్లి బృందానికి చెందిన ఐదుగురు చనిపోయారు. మరో15 మందికిపైగా గాయపడ్డారు.
కాగా, ఈ విషయం తెలిసిన వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. స్థానికుల సహాయంతో సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని సమీప ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మరణించిన ఐదుగురి మృతదేహాలను కూడా పోస్ట్మార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో ఆ బస్సు బోల్తా పడినట్లు పోలీసులు తెలిపారు. ప్రమాద సమయంలో బస్సులో 40 మంది వ్యక్తులు ఉన్నట్లు చెప్పారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీస్ అధికారి వెల్లడించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

