యుద్ధోన్మాదికి మద్దతా?
ఉక్రెయిన్‌పై యుద్ధోన్మాదంతో విరుచుకుపడి సామాన్యులను కూడా పొట్టన పెట్టుకొంటున్న రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు మద్దతు తెలుపుతూ మనదేశంలో కొందరు సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దేశభక్తులమని చెప్పుకొనే ఒక వర్గం వారు ‘ఐ స్టాండ్ విత్ పుతిన్' అనే హ్యాష్‌ట్యాగ్‌ను ట్విట్టర్లో ట్రెండ్ చేస్తున్నారు.
హైదరాబాద్, మార్చి 2 (నమస్తే తెలంగాణ): ఉక్రెయిన్‌పై యుద్ధోన్మాదంతో విరుచుకుపడి సామాన్యులను కూడా పొట్టన పెట్టుకొంటున్న రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు మద్దతు తెలుపుతూ మనదేశంలో కొందరు సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దేశభక్తులమని చెప్పుకొనే ఒక వర్గం వారు ‘ఐ స్టాండ్ విత్ పుతిన్’ అనే హ్యాష్‌ట్యాగ్‌ను ట్విట్టర్లో ట్రెండ్ చేస్తున్నారు. ఉక్రెయిన్‌లో ఇప్పటికీ వేలమంది విద్యార్థులు చిక్కుబడిపోయారు. మంగళవారం రష్యా క్షిపణి దాడిలో ఓ భారతీయ విద్యార్థి ప్రాణాలు కోల్పోయారు. వందలమంది నీరు, ఆహారం దొరకక అలమటిస్తూ కిలోమీటర్ల దూరం కాలినడకన సురక్షిత ప్రాంతాలకు వెళ్తున్నారు. కేంద్రప్రభుత్వం అక్కడి విద్యార్థులను స్వదేశం తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నప్పటికీ ఇంకా వేలమంది అక్కడే ఉండిపోయి, ఏ క్షణం ఏం జరుగుతుందోనని వణికిపోతున్నారు. ఏ దేశ పౌరులన్నది పట్టించుకోకుండా కనిపించిన ప్రతి వ్యక్తిని కాల్చేయాలని పుతిన్ తన సేనలకు ఆదేశాలిచ్చినట్టు వార్తలు వస్తున్నాయి. దీంతో ఉక్రెయిన్‌లోని భారతీయులు బిక్కుబిక్కుమంటూ సహాయం కోసం ఎదురుచూస్తున్నారు. పరిస్థితి ఇంత దారుణంగా ఉంటే అందుకు కారణమైన పుతిన్‌కు మనదేశంలోని కొందరు మద్దతు తెలుపటంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Niranjan Reddy | కొడంగల్ నిర్వాసితులకు ఒక న్యాయం.. వనపర్తి నిర్వాసితులకు మరో న్యాయమా? : మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి
SA vs AUS | రెన్షా సూపర్ సెంచరీ.. గొప్పగా పుంజుకున్న ఆస్ట్రేలియా..!
Netflix | నెట్‌ఫ్లిక్స్‌లో భారీ ఉద్యోగాల కోత.. 5 శాతం సిబ్బందిని తొలగించేందుకు సన్నాహాలు!
Tragedy | పాకాల బీచ్‌లో విషాదం.. ఇద్దరు మృతి, మరో ఇద్దరు గల్లంతు
ఎంవి పాలెం సమీపంలో పెద్దపులి సంచారం కలకలం?
ట్రెండింగ్ వార్తలు
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?

