న్యూఢిల్లీ: బర్గర్ కింగ్ అవుట్‌లెట్‌లో కాల్పుల సంఘటన కలకలం రేపింది. (Burger King shooting) కాల్పుల శబ్దానికి అక్కడున్న కస్టమర్లు బయటకు పరుగులు తీశారు. ఒక కస్టమర్ హత్యకు సంబంధించిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దేశ రాజధాని ఢిల్లీలో ఈ సంఘటన జరిగింది. మంగళవారం రాత్రి 9 గంటల సమయంలో రాజౌరి గార్డెన్‌లోని బర్గర్ కింగ్ అవుట్‌లెట్‌లో ఒక టేబుల్ వద్ద మహిళ వేచి ఉంది. కొంత సేపటి తర్వాత 26 ఏళ్ల వ్యక్తి అక్కడకు వచ్చాడు. ఆ మహిళ ఫుడ్ ఆర్డర్ చేసింది.
కాగా, బర్గర్ కింగ్ అవుట్లెట్లోకి ఇద్దరు వ్యక్తులు ప్రవేశించారు. ఫుడ్ ఆర్డర్ చేసిన వారిద్దరూ ఆ మహిళతోపాటు కూర్చొన్న వ్యక్తి వెనుకు వచ్చారు. గన్స్‌ను బయటకు తీసి చాలా దగ్గరగా ఆ వ్యక్తిపై కాల్పులు జరిపారు. షాకైన కస్టమర్లు, సిబ్బంది అక్కడి నుంచి బయటకు పరుగులుతీశారు. కాల్పుల్లో మరణించిన 26 ఏళ్ల వ్యక్తిని హర్యానాలోని ఝజ్జర్‌కు చెందిన అమన్ జూన్గా గుర్తించారు.
మరోవైపు అమన్ హత్యపై ఢిల్లీ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బర్గర్ కింగ్‌లో అతడితో పాటు కూర్చొన్న మహిళ పాత్రపైనా అనుమానం వ్యక్తం చేశారు. హంతకులతో సంబంధం ఉన్న ఆ మహిళ అమన్‌ను అక్కడికి రప్పించినట్లు పోలీసులు భావిస్తున్నారు. నిందితులను గుర్తించేందుకు సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలిస్తున్నారు.
కాగా, ఈ హత్య తమ పనే అని గ్యాంగ్‌స్టర్ హిమాన్షు భావు సోషల్ మీడియాలో పేర్కొన్నాడు. తమ సోదరుడి హత్యలో పాల్గొన్న వ్యక్తిపై పగ తీర్చుకున్నట్లు వెల్లడించాడు. మరోవైపు ఈ కాల్పల సంఘటనకు సంబంధించిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
VIDEO | A man was shot at several times by a group of men inside a Burger King outlet in West Delhi’s Rajouri Garden on Tuesday evening. The incident was caught on CCTV installed inside the eatery.
(Source: Third Party) pic.twitter.com/3CfjsLC4Xm
— Press Trust of India (@PTI_News) June 20, 2024