రాయపోల్, డిసెంబర్ 25 : సిద్దిపేట జిల్లా రాయపోల్ మండలం చిన్నమాసాన్ పల్లి గ్రామ సర్పంచ్ రేకుల నర్సింహారెడ్డిని పూర్వ విద్యార్థులు సన్మానించారు. 1994 సంవత్సరంలో పదో తరగతి చదివిన వారంతా గురువారం చిన్నమాసాన్ పల్లి వచ్చి.. బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీచేసి గెలుపొందిన నర్సింహారెడ్డిని శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు తాము చదువుకున్నప్పటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు.
తమలో ఒకడిగా ఉంటూ పూర్వ విద్యార్థులకు ఎలాంటి ఆపద వచ్చినా అండగా నిలుస్తున్న నరసింహారెడ్డిని వారు అభినందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పుర్వ విద్యార్థులు గ్రామాభివృద్ధి తో పాటు పూర్వ విద్యార్థులకు ఎల్లప్పుడు సహాయ సహకారాలు అందించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు న్యాయవాది నరసింహులు. దూలం భాస్కర్, లక్ష్మారెడ్డి, సత్యపాల్ రెడ్డి, మహేందర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.