Karthik Raju|తెలుగు ప్రేక్షకులకు పెద్దగా ఇంట్రడక్షన్ అవసరం లేని యాక్టర్ కార్తీక్ రాజు. కౌసల్య కృష్ణమూర్తి, అథర్వ సినిమాలతో తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు కార్తీక్ రాజు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్న కార్తీక్ రాజు నటిస్తోన్న చిత్రాల్లో ఒకటి విలయ తాండవం (Vilaya Thandavam). ఈ మూవీకి వీఎస్ వాసు దర్శకత్వం వహిస్తున్నాడు. పార్వతి అరుణ్, పుష్ప ఫేం జగదీష్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.
తాజాగా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేశారు. ఫస్ట్ లుక్ పోస్టర్లో బ్యాక్‌డ్రాప్‌లో మంటలు, ఆ మంటల్లో కాలిపోతున్న వస్తువులు, కింద పడిపోయి ఉన్న ఫొటోఫ్రేమ్, హీరో తలకు కట్టు, ఓ చేతిపై మంటలు చెలరేగడం వంటి దృశ్యాలను చూడొచ్చు. కార్తీక్ రాజు క్యారెక్టర్ ఏదో సీరియస్ టాపిక్‌పై ఇంటెన్స్ గా సాగబోతున్నట్టు పోస్టర్ హింట్ ఇచ్చేస్తుంది.
షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రాన్ని మేకర్స్ పాన్ ఇండియా స్థాయిలో తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్టు ఇన్సైడ్ టాక్. ప్రొడక్షన్ నెంబర్ 1గా వస్తోన్న ఈ చిత్రాన్ని మందల ధర్మారావు, గుంపు భాస్కర రావు జీఎంఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు.
Rage. Revenge. Reckoning.
Beware of the Beast 🔥@Imkarthikraju ‘s intense & action- packed FIRST LOOK from #VilayaThandavam is out #VSVasu #GMRMovieMakers#MandalaDharmaRao #GumpuBhaskarRao#JagadeeshPrathapBandari #ParvathiArun@GowrahariK #VenkatMaddirala #SureshRagutu… pic.twitter.com/K0c8SCQ5Ha
— BA Raju’s Team (@baraju_SuperHit) December 25, 2025
Kurchi Thatha | కుర్చీ తాత కన్ను మూసారా.. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారానికి చెక్
Jailer 2 | జైలర్ 2లో షారుఖ్ ఖాన్.. సీక్రెట్ లీక్ చేసిన మిథున్ చక్రవర్తి!
The Raaja Saab | డార్లింగ్ ఫ్యాన్స్‌కు క్రిస్మస్ ట్రీట్.. ‘ది రాజా సాబ్’ నుండి మ్యూజికల్ సర్ప్రైజ్!