Raje Yuvaraje | యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ హర్రర్ కామెడీ ఎంటర్టైనర్ ‘ది రాజా సాబ్’. టాలెంటెడ్ డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ పాన్ ఇండియా చిత్రంపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. తాజాగా ఈ సినిమా నుంచి క్రిస్మస్ పండుగను పురస్కరించుకుని చిత్ర యూనిట్ ఒక స్పెషల్ గిఫ్ట్‌ను అభిమానులకు అందించింది. సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఈ చిత్ర నిర్మాణ సంస్థ ‘పీపుల్ మీడియా ఫ్యాక్టరీ’ ఒక బ్యూటిఫుల్ మ్యూజికల్ సర్ప్రైజ్ను విడుదల చేసింది. ‘రాజే యువరాజే..’(Raje Yuvaraje) అంటూ సాగే పాట ప్రోమోను రిలీజ్ చేస్తూ, ప్రభాస్ వింటేజ్ లుక్స్‌తో ఫ్యాన్స్‌ను ఖుషీ చేసింది. ఈ పాటలో థమన్ అందించిన సంగీతం మ్యాజికల్ గా ఉందని సోషల్ మీడియాలో చర్చ నడుస్తుంది. ఈ సినిమాలో ప్రభాస్ సరసన నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ది కుమార్ ముగ్గురు భామలు నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని జనవరి 9న గ్రాండ్‌గా ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయబోతుంది చిత్రబృందం.