e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, October 21, 2021
Home News అధికారులు ఉన్నది ‘మా చెప్పులు తీసేందుకే’.. ఉమా భారతి సంచలన వ్యాఖ్యలు

అధికారులు ఉన్నది ‘మా చెప్పులు తీసేందుకే’.. ఉమా భారతి సంచలన వ్యాఖ్యలు

భోపాల్‌: ప్రభుత్వ అధికారులు ఉన్నది తమ చెప్పులు తీసేందుకేనని బీజేపీ సీనియర్‌ నాయకురాలు ఉమా భారతి సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘బ్యూరోక్రసీ ఏమీ లేదు. బ్యూరోక్రసీ చప్పల్స్ (చెప్పులు) తీయడానికి ఉంది. అధికారులు మా చెప్పులను తీసుకుంటారు. మేము దానిని మాత్రమే అనుమతిస్తాము’ అని ఆమె మాట్లాడిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది.

మధ్యప్రదేశ్‌ మాజీ సీఎం, కేంద్ర మాజీ మంత్రి ఉమా భారతిని కొందరు ఓబీసీ నాయకులు శనివారం భోపాల్‌లోని ఆమె నివాసంలో కలిశారు. కుల ఆధారిత జనాభా గణన, ప్రైవేట్ ఉద్యోగాలలో ఓబీసీ కోటా డిమాండ్‌ను లేవనెత్తారు. మధ్యప్రదేశ్ బీజేపీ ప్రభుత్వం త్వరగా నిర్ణయం తీసుకోకపోతే నిరసన చేస్తామని హెచ్చరించారు.

- Advertisement -

ఈ సందర్భంగా ఉమా భారతి వారితో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘బ్యూరోక్రాట్లు రాజకీయ నాయకులను నియంత్రిస్తారని మీరు అనుకుంటున్నారా? లేదు. మొదట ప్రైవేట్‌గా చర్చలు జరుగుతాయి. ఆపై బ్యూరోక్రసీ ఒక ఫైల్‌ను సిద్ధం చేస్తుంది. నన్ను అడగండి, 11 సంవత్సరాలు నేను కేంద్ర మంత్రిగా, ముఖ్యమంత్రిగా ఉన్నాను. ముందుగా మేము చర్చించిన తర్వాతే ఫైల్ ప్రాసెస్ అవుతుంది. రాజకీయ నాయకులను బ్యూరోక్రసీ నియంత్రిస్తుందన్నది ఒట్టిమాటే. వారేం చేయలేరు. వారు దేనికి ఉన్నారు? మా చెప్పులు తీయడానికి. మేము వారికి జీతం, పోస్టింగ్‌లు, ప్రమోషన్లు, పదోన్నతులు ఇస్తున్నాం. ఇక వారేం చేయగలరు? నిజం ఏమిటంటే మేము వారిని రాజకీయాల కోసం ఉపయోగిస్తాం’ అని ఆమె అన్నారు.

కాగా, ప్రభుత్వ బ్యూరోక్రాట్లపై ఉమా భారతి చేసిన ఈ వ్యాఖ్యలపై మధ్యప్రదేశ్‌లోని ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ మండిపడింది. ప్రభుత్వ అధికారులు నిజంగానే రాజకీయ నేతల చెప్పులు మోస్తారా అన్నదానిపై సీఎం శివరాజ్ సింగ్‌ చౌహన్‌ స్పష్టత ఇవ్వాలని కాంగ్రెస్ నేత కేకే మిశ్రా డిమాండ్‌ చేశారు.

అయితే తన మాటలను తప్పుగా అర్థం చేసుకున్నారంటూ ఉమా భారతి సోమవారం క్లారిటీ ఇచ్చారు. బ్యూరోక్రసీకి రక్షణగానే తాను మాట్లాడినట్లు ట్వీట్‌ చేశారు. ‘మనలో కొందరు నాయకులు – అధికారంలో కూర్చున్న అసమర్థులు – ‘మేము చాలా మంచివాళ్లం కానీ బ్యూరోక్రసీ మమ్మల్ని మంచి పని చేయడానికి అనుమతించదు’ అనే వారు తమ అసమర్థతను నివారించడానికి బ్యూరోక్రసీపై ముసుగు వేస్తారు. వాస్తవం ఏమిటంటే నిజాయితీగల బ్యూరోక్రసీ అధికారంలో ఉన్న బలమైన, నిజమైన, మంచి ఉద్దేశ్యంతో ఉన్న నాయకుడికి మద్దతు ఇస్తుంది. ఇది నా అనుభవం’ అని ఆమె ట్వీట్‌ చేశారు.

‘నన్ను క్షమించండి, నా వ్యక్తీకరణలు బాగున్నప్పుడు నేను సమగ్రమైన భాషను ఉపయోగించాను. పరిమిత వ్యక్తుల మధ్య అనధికారిక సంభాషణలలో కూడా మిత భాష ఉపయోగించాలని నేను ఈ రోజు నుండి ఈ పాఠం నేర్చుకున్నాను’ అని అందులో పేర్కొన్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement