Building collapse : కర్ణాటక రాజధాని బెంగళూరులో నిర్మాణంలో ఉన్న బహుళ అంతస్తుల భవనం కుప్పకూలింది. భవనంలో కూలీలు పనిచేస్తుండగానే ఒక్కసారిగా కూలిపోయింది. దాంతో పలువురు కూలీలు భవన శిథిలాల కింద చిక్కుకున్నారు. బెంగళూరులోని హొరమావు అగార ఏరియాలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
భవనం కుప్పకూలిన వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దాంతో పోలీసులు, స్థానిక అధికారులు, రెస్క్యూ టీమ్స్ ఘటనా ప్రాంతానికి చేరుకున్నాయి. బాధితులను రక్షించేందుకు సహాయక చర్యలు చేపట్టాయి. శిథిలాల తొలగించి బాధితులను బయటకు తీసుకొచ్చేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.