Building collapse : దేశ రాజధాని ఢిల్లీలో ఓ వాణిజ్య భవనం కుప్పకూలింది. భవన శిథిలాల కింద నలుగురైదుగురు చిక్కుకున్నట్లు స్థానికులు చెబుతున్నారు. ఢిల్లీలోని రోహిణి ఏరియాలోగల సెక్టార్ 7లో బుధవారం సాయంత్రం 4.15 గంటలకు ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందిన వెంటనే రెస్క్యూ టీమ్స్ ఘటనా ప్రాంతానికి చేరుకున్నాయి.
స్థానిక పోలీసులు, అధికార యంత్రాంగంతో కలిసి రెస్క్యూ టీమ్స్ సహాయక చర్యలు చేపట్టాయి. శిథిలాలను తొలగించి బాధితులను రక్షించేందుకు ప్రయత్నిస్తున్నాయి. భవనం కూలినట్లు తమకు సాయంత్రం 4.15 గంటలకు సమాచారం వచ్చిందని, ఆ వెంటనే ఘటనా ప్రాంతానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టామని ఢిల్లీ ఫైర్ డిపార్టుమెంట్‌కు చెందిన అసిస్టెంట్ డివిజినల్ ఆఫీసర్ ఆర్కే సిన్హా చెప్పారు.
#WATCH | Delhi: 4-5 people feared trapped under debris following the collapse of a commercial building in the Sector 7 area of Rohini. Rescue and search operation underway. pic.twitter.com/UvB51snwkW
— ANI (@ANI) June 4, 2025