Budget 2022 | ఆ రెండ్రోజులు ‘క్వశ్చన్ అవర్.. జీరో అవర్’కు నో.. ఎందుకంటే?!
Budget 2022 | మంగళవారం బడ్జెట్ ప్రవేశపెట్టనున్నందున జనవరి 31, ఫిబ్రవరి 1ల్లో ఉభయసభల్లో క్వశ్చన్/జీరో అవర్ రద్దు చేశారు.

Budget 2022 | పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఈ నెల 31, ఫిబ్రవరి ఒకటో తేదీల్లో జీరో అవర్, క్వశ్చన్ అవర్ రద్దు చేశారు. పార్లమెంట్ ఉభయ సభల్లోనూ ఈ రెండు రోజులు జీరో అవర్, క్వశ్చన్ అవర్ రద్దయ్యాయి. ఈ నెల 31న పార్లమెంట్ సెంట్రల్ హాల్లో ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ప్రసంగించడంతో పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అవుతాయి. ఫిబ్రవరి ఒకటో తేదీ ఉదయం 11 గంటలకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వచ్చే ఆర్థిక సంవత్సరం (2022-23) బడ్జెట్ ప్రతిపాదనలను పార్లమెంట్‌కు సమర్పిస్తారు. ఈ నేపథ్యంలో తొలి రెండు రోజులు పార్లమెంట్ ఉభయసభల్లోనూ జీరో అవర్, క్వశ్చన్ అవర్ రద్దు చేసినట్లు పార్లమెంట్ బులెటిన్‌లో తెలిపింది.
సభ్యులేదైనా అత్యవసర అంశాలను లేవనెత్తాలనుకుంటే రెండో తేదీన జీరో అవర్‌లో చేపట్టవచ్చునని ఆ బులెటిన్ వివరించింది. ఫిబ్రవరి రెండో తేదీన లేవనెత్తే అంశాలపై మంగళవారం నాడే నోటీసు ఇవ్వాలని తెలిపింది. ఫిబ్రవరి ఒకటో తేదీ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు ఆన్లైన్లో ఈ-పోర్టల్ ద్వారా గానీ, పార్లమెంటరీ నోటీస్ ఆఫీసులో మాన్యువల్‌గా గానీ నోటీసు ఇవ్వవచ్చునని వెల్లడించింది.
పార్లమెంటరీ నిబంధనలు, సంప్రదాయాల ప్రకారం ప్రతి రోజూ క్వశ్చన్ అవర్, జీరో అవర్ 60 నిమిషాలు సాగుతాయి. లోక్‌సభలో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు క్వశ్చన్ అవర్ దాని కొనసాగింపుగా జీరో అవర్, రాజ్యసభలో 11 గంటల నుంచి 12 గంటల వరకు జీరో అవర్, క్వశ్చన్ అవర్ నిర్వహిస్తారు.
పార్లమెంట్ ఉభయసభల సంయుక్త సమావేశంలో జనవరి 31 ఉదయం 11 గంటలకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ప్రసంగిస్తారు. ఆ వెంటనే పార్లమెంట్లో ఎకనమిక్ సర్వేను ప్రవేశపెడతారు. మంగళవారం (ఫిబ్రవరి 1) ఉదయం 11 గంటలకు నిర్మలా సీతారామన్ బడ్జెట్ సమర్పిస్తారు. గతేడాది మాదిరిగానే ఈసారి కూడా పేపర్ లెస్ బడ్జెట్ ప్రవేశపెడతారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | తెలంగాణ ఉద్యమకారుడి కుటుంబానికి అండగా కేటీఆర్.. 10 లక్షల ఆర్థిక సాయం అందజేత..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Engilipula Batukamma | సందడిగా.. సంప్రదాయబద్ధంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు..!
ఈఎంసిలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
Bathukamma | జపాన్‌లో బతుకమ్మ సంబురాలు.. టోక్యోలో వెల్లివిరిసిన తెలంగాణ సంస్కృతి
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

