Budget 2026 | విదేశీ ఆస్తులు వెల్లడించలేదా.. మీకో అవకాశం.. గ్యాంబ్లింగ్‌కు చెక్ పెట్టేలా కొత్త పన్ను
Budget 2026 | విదేశీ ఆస్తులు వెల్లడించలేదా.. మీకో అవకాశం.. గ్యాంబ్లింగ్‌కు చెక్ పెట్టేలా కొత్త పన్నుBudget 2026 : భారత పౌరసత్వం ఉన్న పౌరులు తప్పనిసరిగా తమ విదేశీ ఆస్తులు, ఆదాయాల వివరాలు ఇవ్వాలి.
Budget 2026 | విదేశీ ఆస్తులు వెల్లడించలేదా.. మీకో అవకాశం.. గ్యాంబ్లింగ్‌కు చెక్ పెట్టేలా కొత్త పన్నుBudget 2026 : భారత పౌరసత్వం ఉన్న పౌరులు తప్పనిసరిగా తమ విదేశీ ఆస్తులు, ఆదాయాల వివరాలు ఇవ్వాలి. ఇలా వెల్లడించలేకపోతే తర్వాత వాటిపై పన్నులతోపాటు భారీ మొత్తంలో జరిమానాలు విధిస్తారు. అయితే, తాజా బడ్జెట్ 2026లో ఇలాంటివారికి కాస్త ఊరట కలిగించే నిర్ణయం తీసుకున్నారు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్.
విదేశీ ఆస్తులు వెల్లడించని వారిని రెండు కేటగిరీలుగా విభజించారు. మొదటిది కేటగిరి ఏ. విదేశాల్లో ఒక కోటి వరకు ఆదాయం లేదా ఆస్తి కలిగి, ఆ విషయం వెల్లడించకపోతే ఇకపై సాధారణ పన్ను 30 శాతం చెల్లించాలి. అదనంగా పెనాల్టీ బదులు మరో 30 శాతం పన్ను చెల్లిస్తే చాలు. ఇక కేటగిరి బిలో విదేశాల్లో ఐదు కోట్ల విలువైన ఆస్తులు లేదా ఆదాయం ఉన్నవారిని పరిగణిస్తారు. వీరు ముందుగా ఆస్తి వివరాలు వెల్లడించకుంటే తర్వాత రూ.1 లక్ష చెల్లిస్తే చాలు. అయితే, ఇదంతా తర్వాత ఆరు నెలల్లోనే చేయాలి. ఇది వారికి రెండో అవకాశం కింద లెక్క. ఎన్ఆర్ఐకి సంబంధించిన ఆస్తి కొంటుంటే.. అమ్మే వాళ్లకు టీడీఎస్ కట్ చేసి డబ్బు చెల్లించాలి. గతంలో ఇది ముందుగా టాన్‌లో (టాక్స్ డెడక్షన్ అకౌంట్ నెంబర్)లో డిపాజిట్ చేయాల్సి ఉండేది.
ఈ ప్రక్రియ గందరగోళంగా ఉండటంతో ఇల్లు, ఆస్తుల కొనుగోలుదారులు ఇబ్బంది పడేవారు. ట్యాన్తో సంబంధం లేకుండా ప్యాన్ నెంబర్‌తో టీడీఎస్‌ను డిపాజిట్ చేయొచ్చు. బెట్టింగ్, ఇతర ఆన్లైన్ గేమ్స్ ద్వారా ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఇలాంటివారిని గ్యాంబ్లింగ్‌కు దూరంగా ఉంచాలంటే పన్నులు పెంచడమే మార్గం. అందుకే గేమింగ్ సంస్థలపై పన్నులు రెట్టింపు చేసింది. సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ (ఎస్టీటీ)ని పెంచింది. సెక్యూరిటీ గార్డులు, డ్రైవర్లు వంటి మ్యాన్ పవర్ సంస్తలు అందించే సేవలపై పన్ను తగ్గించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

