న్యూఢిల్లీ, మే 1: ఓ కేసులో దోషిగా తేలి, నాలుగేండ్ల జైలు శిక్ష పడిన బీఎస్పీ ఎంపీ అఫ్జల్ అన్సారీపై ఊహించినట్టుగానే అనర్హత వేటు పడింది. ఈ మేరకు అఫ్జల్ ఎంపీ సభ్యత్వాన్ని రద్దు చేస్తూ లోక్సభ సెక్రటేరియట్ సోమవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఉత్తరప్రదేశ్లోని ఘాజీపూర్ ఎంపీగా అఫ్జల్ అన్సారీ బీఎస్పీ నుంచి ప్రాతిన్యిం వహిస్తున్నారు. 2007 నాటికి కిడ్నాప్, హత్య కేసులో ఘాజీపూర్ ఎంపీ/ఎమ్మెల్యే ప్రత్యేక కోర్టు.. అఫ్జల్ అన్సారీ, ఆయన సోదరుడు గ్యాంగ్స్టర్ ముక్తార్ అన్సారీని న్యాయస్థానం దోషులుగా తేల్చింది. ముక్తార్కు పదేండ్లు, అఫ్జల్కు నాలుగేండ్ల విక్ష విధిస్తూ అడిషనల్ సెషన్స జడ్జి గత శనివారం తీర్పునిచ్చారు. రెండేండ్ల కంటే ఎక్కువ శిక్ష పడిన నేపథ్యంలో రాజ్యాంగంలోని ఆర్టికల్ 102(1)(ఈ), ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 8 ప్రకారం అఫ్జల్ లోక్సభ సభ్యత్వాన్ని రద్దు చేసినట్టు లోక్సభ సెక్రటేరియట్ వెల్లడించింది. శిక్ష పడిన నాటి నుంచే ఇది అమల్లో ఉంటుందని తెలిపింది.