న్యూఢిల్లీ: బీఎస్పీ ఎంపీ డానిష్ అలీ బీజేపీ ఎంపీలపై తీవ్ర ఆరోపణలు చేశారు. లోక్సభలో తనను మాటలతో చంపేశారని, సభ వెలుపల తనను మూకదాడిలో భౌతికంగా చంపే పరిస్థితిని సృష్టిస్తున్నారని మండిపడ్డారు. చంద్రయాన్-3 విజయవంతమవడంపై లోక్సభలో గురువారం చర్చ సమయంలో డానిష్, బీజేపీ ఎంపీ రమేశ్ బిధూరీ మధ్య వాగ్వాదం జరిగింది.
అలీపై బిధూరీ మతపరమైన అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని ఆరోపణలు వచ్చాయి. మరోవైపు ప్రధాని నరేంద్ర మోదీపై డానిష్ అలీ అమర్యాదకర వ్యాఖ్యలు చేశారని, దీనిపై విచారణ జరపాలని లోక్సభ సభాపతి ఓం బిర్లాను బీజేపీ ఎంపీలు నిషికాంత్ దూబే, రవికిషణ్ శుక్లా కోరారు.