న్యూఢిల్లీ: పంజాబ్‌లో జరిగిన ఎన్కౌంటర్లో సుమారు 47 కేజీల హెరాయిన్ పట్టుకున్నారు. బీఎస్ఎఫ్ దళాలు ఆ మాదకద్రవ్యాలను సీజ్ చేశాయి. హెరాయిన్‌తో పాటు ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని వాళ్లు స్వాధీనం చేసుకున్నారు. గురుదాస్‌పూర్‌లోని చందూ వాడ్లా పోస్టు వద్ద ఈ ఎన్కౌంటర్ జరిగింది. ఆ ఎదురుకాల్పుల్లో ఓ సైనికుడు గాయపడ్డాడు. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు అందాల్సి ఉందని బీఎస్ఎఫ్ డీఐజీ తెలిపారు.
పాకిస్థాన్ స్మగ్లర్ల కాల్పుల్లో జవాను మృతి
ఇవాళ ఉదయం 5.15 నిమిషాలకు ఎన్కౌంటర్ జరిగింది. సరిహద్దు వద్ద పాకిస్థాన్ స్మగ్లర్ల కదలికలను బీఎస్ఎఫ్ జవాన్లు గుర్తించారు. అయితే పాక్ స్మగ్లర్లు కాల్పులకు దిగారు. ఆ సమయంలో జరిగిన ఎన్కౌంటర్లో ఓ జవాను ప్రాణాలు కోల్పోయాడు. మరో జవాను గాయపడ్డాడు. అతని పరిస్థితి నిలకడగా ఉందిని బీఎస్ఎఫ్ వర్గాలు తెలిపాయి.
ప్లాస్టిక్ ప్యాకెట్లలో హెరాయిన్
పసుపు రంగు ప్లాస్టిక్ ప్యాకెట్లలో హెరాయిన్ స్మగ్లింగ్ చేస్తున్నట్లు గుర్తించారు. పాక్ స్మగ్లర్ల నుంచి మొత్తం 47 ప్యాకెట్లను సీజ్ చేశారు. ఏడు ప్యాకెట్లలో ఓపియం ఉన్నట్లు అనుమానిస్తున్నారు. 44 రౌండ్లకు సరిపడా 0.30 క్యాబిబర్ బుల్లెట్లను సీజ్ చేశారు. రెండు మ్యాగ్జిన్లతో పాటు ఒక చైనీస్ పిస్తోల్‌ను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఒక బెరట్టా పిస్తోల్, ఏకే 47కు చెందిన నాలుగు మ్యాగ్జిన్లు, ఇతర ఆయుధాలను సీజ్ చేసినట్లు బోర్డర్ సెక్యూర్టీ ఫోర్స్ తెలిపింది.