ముంబై, ఏప్రిల్ 19 (నమస్తే తెలంగాణ) : బీజేపీ పాలిత మహారాష్ట్రలో ఒక మహిళను దారుణంగా హత్య చేసిన ఘటన ఆదివారం వెలుగులోకి వచ్చింది. ప్రేమ వలలో చికుకున్న ఆమెను మతం మార్చాక ఇలా అంతమొందించారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ కేసులో నిందితుడైన ఆమె ప్రియుడిని, అతడి తల్లిదండ్రులను పోలీసులు అరెస్టు చేశారు.
మృతురాలి కుటుంబ సభ్యుల కథనం ప్రకారం&నందఖేడా తాలూకా మంగ్రుల్పీర్కు చెందిన యువతికి వార్ధాకు చెందిన ఒక యువకుడితో కొన్ని నెలల క్రితం పెండ్లి జరిగింది. ఆ తర్వాత ఆమెకు సాదిక్ షా అనే యువకుడితో పరిచయమైంది. అతడు ఆమెను ప్రేమ పేరుతో తప్పు దోవ పట్టించి అపహరించుకొని ముంబైకి తీసుకెళ్లాడు. ఆ తర్వాత ఆమె గత నెలలో అకోలాకు వచ్చి ప్రసవించింది. ఆ తర్వాత కొన్ని రోజులకే హత్యకు గురైంది.