Bihar | పాట్నా: పొలాల మధ్య దిష్టిబొమ్మలా నిర్మించిన బ్రిడ్జిలోని చిన్న భాగం బీహార్లో స్థానికులను వెక్కిరిస్తూ ఉంది. రెండు వైపులా వెళ్లడానికి అనుసంధానిస్తూ రోడ్డు మార్గం లేదు. స్థల సేకరణ చేయలేదు. అలాంటప్పుడు పొలం మధ్యలో ఆ కాసింత ముక్క బ్రిడ్జిని పరమానందయ్య శిష్యుల్లా ఎందుకు నిర్మించారు? అంటే అధికారుల నుంచి సమాధానం లేదు.
వివరాల్లోకి వెళితే.. బీహార్లోని అరారియాలోని పరమానందపూర్లో దీనిని నిర్మించారు. సీఎం గ్రామీణ సడక్ కింద మూడు కోట్లతో నిర్మాణాన్ని ప్రారంభించి అర్ధాంతరంగా నిలిపివేశారు. ఇక్కడి నది వల్ల వర్షాకాలంలో ప్రజల ఇబ్బందులను తీర్చడానికి మూడు కోట్లతో మూడు కిలోమీటర్ల రోడ్ను అనుసంధానం చేస్తూ బ్రిడ్జి నిర్మించడానికి అధికారులు నిర్ణయించారు. అయితే, భూసేకరణ చేయకుండా మధ్యలోనే పనులను నిలిపివేశారు.