Bridge Collapse | బీజేపీ-జేడీయూ కూటమి పాలనలోని బీహార్ (Bihar) రాష్ట్రంలో వరుసగా వంతెనలు (Bridge Collapse) కూలిపోతుండటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది (Creates Panic). రెండు రోజుల క్రితం అరారియా జిల్లాలోని పరారియా గ్రామంలో నిర్మాణంలో ఉన్న ఓ వంతెన కూలిపోయిన విషయం తెలిసిందే. ఆ ఘటన మరవకముందే తాజాగా మరో వంతెన కూలిపోయింది. సివాన్‌లోని దారుండా బ్లాక్‌లోని రామ్గర్హాలో గల గండక్ కాలువ (Gandak canal)పై నిర్మించిన వంతెన కూలిపోయినట్లు అక్కడి అధికారులు తెలిపారు. అదృష్టవశాత్తూ ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం సంభవించలేదు. అయితే, వారం వ్యవధిలోనే వరుసగా రెండు వంతెనలు కూలిపోవడంతో స్థానికుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.
అరారియా జిల్లాలోని పరారియా గ్రామంలో రెండు రోజుల క్రితం నిర్మాణంలో ఉన్న వంతెన కూలిపోయిన విషయం తెలిసిందే. రూ.12 కోట్ల వ్యయంతో రాష్ట్ర ప్రభుత్వం నిర్మించిన ఈ వంతెనలో అప్రోచ్ రోడ్ల నిర్మాణాన్ని ఇంకా చేపట్టలేదు. దీంతో ఈ వంతెనపై ప్రజా రవాణాకు ఇంకా అనుమతి ఇవ్వలేదు. బక్రా నదిపై కుర్సా కంటా, స్కిటీ ప్రాంతాలను కలుపుతూ ఈ బ్రిడ్జిని నిర్మించారు. బ్రిడ్జి కూలడానికి గల కారణాలపై అధికారులు విచారణ జరుపుతున్నారు. ఈ సంవత్సరం మార్చి నెలలో కోసి నదిపై నిర్మిస్తున్న వంతెన కూలి పది మంది గాయపడిన విషయం తెలిసిందే.
Also Read..
Ambubachi Mela: అస్సాంలో అంబుబాచి మేళా.. కామాఖ్య ఆలయ ద్వారాలు మూసివేత
Swimming Pool | షాకింగ్.. స్విమ్మింగ్ పూల్ నుంచి బయటకొచ్చి కుప్పకూలి బాలుడు మృతి.. VIDEO
Madhya Pradesh | మహిళపై కర్రతో దాడి.. రక్షించకపోగా వీడియోలు తీసిన జనం