Swimming Pool | షాకింగ్.. స్విమ్మింగ్ పూల్ నుంచి బయటకొచ్చి కుప్పకూలి బాలుడు మృతి.. VIDEO
Swimming Pool | ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh)లో షాకింగ్ ఘటన వెలుగుచూసింది. ఓ 15 ఏళ్ల బాలుడు స్విమ్మింగ్ పూల్ (Swimming Pool) నుంచి బయటకు వచ్చి ఒక్కసారిగా కుప్పకూలి ప్రాణాలు కోల్పోయాడు.
Swimming Pool | ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh)లో షాకింగ్ ఘటన వెలుగుచూసింది. ఓ 17 ఏళ్ల బాలుడు స్విమ్మింగ్ పూల్ (Swimming Pool) నుంచి బయటకు వచ్చి ఒక్కసారిగా కుప్పకూలి ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన మీరట్ (Meerut)లో శుక్రవారం చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. సివల్ఖాస్ ప్రాంతానికి చెందిన 17 ఏళ్ల బాలుడు ఫ్రెండ్స్‌తో కలిసి ఈత కొట్టేందుకు స్విమ్మింగ్ పూల్‌లోకి దిగాడు. కాసేపు సరదాగా కొలనులో ఈతకొట్టిన బాలుడు బయటకు వచ్చాడు. గట్టుపై అటూఇటూ తిరిగాడు. అనంతరం ఒక్కసారిగా కుప్పకూలి నేలపై పడిపోయాడు. అక్కడే ఉన్న వారు బాలుడిని గుర్తించి లేపేందుకు ప్రయత్నించారు. అయితే బాలుడి నుంచి ఎలాంటి స్పందనా లేదు. దీంతో అతడిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అక్కడ పరీక్షించిన వైద్యులు బాలుడు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు అక్కడే ఉన్న సీసీటీవీ ఫుటేజ్‌లో రికార్డయ్యాయి. ఈ ఘటన అనంతరం స్విమ్మింగ్ పూల్‌ను నిర్వాహకులు మూసివేశారు. ఈ మేరకు స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు.
#DisturbingVisuals: 17 year old boy died in a swimming pool in Meerut, Uttar Pradesh. #Meerut #SwimmingPool #CCTV #UttarPradesh #MeerutNews #UttarPradeshNews #Shocking #SuddenDeath #heatwave pic.twitter.com/B58s5JoS09
— upuknews (@upuknews1) June 21, 2024
Also Read..
Deepfake Video | ముకేశ్ అంబానీ ఫేక్ వీడియో.. రూ.7లక్షలు మోసపోయిన వైద్యుడు
Kallakurichi | కళ్లకురిచిలో మృత్యుఘోష.. నాటుసారా ఘటనలో 53కు పెరిగిన మృతులు
YSRCP Office : తాడేపల్లిలో వైఎస్ఆర్సీపీ ఆఫీసు కూల్చివేత.. వీడియో
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

