Deepfake Video | ముకేశ్ అంబానీ ఫేక్ వీడియో.. రూ.7లక్షలు మోసపోయిన వైద్యుడు
Deepfake Video | ప్రముఖ పారిశ్రామిక వేత్త ముకేశ్ అంబానీ (Mukesh Ambani) డీప్‌ఫేక్ వీడియో కారణంగా ముంబైకి చెందిన ఓ వైద్యుడు (Mumbai doctor) దారుణంగా మోసపోయారు.
Deepfake Video | దేశవ్యాప్తంగా ప్రస్తుతం డీప్‌ఫేక్ వీడియోల (deepfake video) వ్యవహారం తీవ్ర దుమారం రేపుతోంది. ఇప్పటికే పలువురు సినీ తారలు, రాజకీయ నేతలు ఈ ఫేక్ వీడియోల బారిన పడ్డారు. కొందరు ఆకతాయిలు సినీ సెలబ్రిటీలకు చెందిన ఫేక్ వీడియోలను సృష్టించి వైరల్ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే, దీన్నే ఆసరాగా చేసుకున్న సైబర్ నేరగాళ్లు కొత్త తరహా మోసాలను తెరతీశారు. ప్రముఖుల పేర్లతో డీప్ ఫేక్ వీడియోలను సృష్టిస్తూ రూ. లక్షలు రూపాయలను కొల్లగొడుతున్నారు. ఇప్పటికే ఈ తరహా మోసాలు దేశంలో అనేకం వెలుగు చూశాయి. సైబర్ కేటుగాళ్ల వలలో చిక్కుకొని కొందరు ఉద్యోగులు, ఉన్నతాధికారులు, సినీ స్టార్స్ సహా సామాన్యులు సైతం మోసపోయి భారీ మొత్తంలో డబ్బు పొగొట్టుకున్నారు.
తాజాగా ప్రముఖ పారిశ్రామిక వేత్త ముకేశ్ అంబానీ (Mukesh Ambani) డీప్‌ఫేక్ వీడియో కారణంగా ముంబైకి చెందిన ఓ వైద్యుడు (Mumbai doctor) దారుణంగా మోసపోయారు. మహారాష్ట్రలోని అంధేరికి చెందిన 54 ఏళ్ల ఆయుర్వేద వైద్యుడు కేహెచ్ పాటిల్ ఇన్స్టాగ్రామ్ ర్సీల్ ద్వారా షేర్ ట్రేడింగ్ స్కామ్‌కు గురయ్యాడు. ఆ రీల్స్ లో ప్రముఖ వ్యాపారవేత్త ముఖేశ్ అంబానీ డీప్‌ఫేక్ వీడియో దర్శనమిచ్చింది. వీడియోలో అంబానీ ‘రాజీవ్ శర్మ ట్రేడ్ గ్రూప్’ (Rajiv Sharma Trade Group)ను ప్రొమోట్ చేస్తున్నట్లుగా కనిపించింది.
దీంతో సదరు వైద్యుడు ఆ సంస్థ గురించి వెంటనే గూగుల్ సెర్చ్ చేయగా.. ముంబై, లండన్‌లో కార్యాలయాలు ఉన్నట్లు కనిపించింది. ఇది నమ్మిన సదరు వైద్యుడు ఏకంగా 7 లక్షల రూపాయలను వివిధ బ్యాంకు ఖాతాలకు పంపాడు. ఇక ట్రేడింగ్ వెబ్ సైట్లో రూ.రూ.30 లక్షల లాభం కూడా చూపింది. దీంతో సంతోషించిన వైద్యుడు ఆ డబ్బును విత్‌డ్రా చేసుకునేందుకు పలుసార్లు ప్రయత్నించి విఫలమయ్యారు. దీంతో తాను మోసపోయానని గ్రహించిన వైద్యుడు పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకున్న ముంబై పోలీసులు సదరు ఖాతాల అక్రమ లావాదేవీలను బ్లాక్ చేసేలా బ్యాంకులకు ఆదేశాలిచ్చారు.
Also Read..
Robot Tax | బడ్జెట్లో రోబో ట్యాక్స్.. తీసుకురానున్న కేంద్ర ప్రభుత్వం?
PM Modi | ఆర్థిక అసమానతలు తగ్గవు.. వచ్చే ఐదేండ్ల మోదీ పాలనలో పేదల కష్టాలేమీ తీరవు!
Gold Price | పసిడి-వెండి జిగేల్.. మళ్లీ పుంజుకుంటున్న ధరలు
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

